logo
Published : 30/11/2021 03:21 IST

చక్కటి కుటుంబం.. చిన్నాభిన్నం

తండ్రి దూరమై.. తల్లి జైలుపాలై

అనాథలైన పిల్లలు

అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు  

గోదావరిఖని, న్యూస్‌టుడే : కుటుంబంలో నెలకొన్న కలహాలతో పిల్లలు అనాథలయ్యారు.. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. తండ్రి హత్య.. తల్లి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తల్లి చేసిన తప్పు కారణంగా తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. తల్లిదండ్రుల సంరక్షణలో పెరగాల్సిన ముగ్గురు చిన్నారులకు ఆలనాపాలనా కరవైంది.. ఎన్టీపీసీ ఖాజీపల్లికి చెందిన కాంపల్లి శంకర్‌ హత్యకు గురికాగా ఇందులో అతని భార్య ప్రమేయం ఉందని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రుల మధ్య నెలకొన్న విభేదాలు పిల్లలకు శాపంగా మారాయి. ఖాజీపల్లికి చెందిన శంకర్‌, మాతంగి కాలనీలకు చెందిన మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి నందిని, మధుశ్రీ, విఘ్నేశ్‌ జన్మించారు. ఇటీవల కాలంలో తల్లి వ్యవహారంపై తండ్రి కోపంగా ఉన్నాడు. వేరే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక అతనితో ఘర్షణ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే అతని చేతిలో హత్యకు గురయ్యాడు. ఇందులో తల్లి ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కూతురు నందిని పదో తరగతి పూర్తి చేసింది. రెండో కూతురు మధుశ్రీ ఐదో తరగతి చదువుతోంది. చిన్న కుమారుడు విఘ్నేశ్‌ మూడో తరగతి చదువుతున్నాడు. పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సిన తల్లిదండ్రులిద్దరూ దూరం కావడంతో వారి బాగోగులు ఎవరు చూసుకుంటారో తెలియని పరిస్థితి. తండ్రి హత్యతో ఇరు కుటుంబాల మధ్య అగాధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ముగ్గురు పిల్లలను పోషించే స్థోమత నాయనమ్మ పోచమ్మకు లేదు. స్వీపర్‌గా పనిచేసే ఆమెకు భారమే.. ఒక్క హత్యతో కుటుంబాల మధ్య బంధుత్వాలు తెగిపోగా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని