logo
Published : 30/11/2021 03:21 IST

గంజాయి ముఠా అరెస్టు

నాలుగు చరవాణులు, ద్విచక్రవాహనం స్వాధీనం


అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీను

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను సోమవారం ఉదయం పట్టుకుని అరెస్టు చేసినట్లు మెట్పల్లి సీఐ శ్రీను తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్‌ మండలం ఒబులాపూర్‌ వంతెన వద్ద గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మల్లాపూర్‌ ఎస్సై రాజేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా మేడిపల్లి మండలం దమ్మనపేట గ్రామానికి చెందిన గాజుల చిరంజీవి(24), కోరుట్ల పట్టణానికి చెందిన లోకిని గంగశ్రీను(19), ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన షేక్‌ కలీమొద్దిన్‌(38), అంగాల కృష్ణగౌడ్‌(32)లు గ్రూపుగా ఏర్పడి కోరుట్ల పట్టణంతో పాటు పలు గ్రామాల్లో గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లు తెలిపారు. గాజుల చిరంజీవి, గంగశ్రీను తరచూ ఆదిలాబాద్‌ వెళ్లి గంజాయిని కొనుగోలు చేసేవారని, కొనుగోలు చేసిన దానిని సేవించడం, కోరుట్ల పట్టణంతో పాటు తదితర గ్రామాల్లో ఎక్కువ ధరలకు అమ్మకాలు చేపడుతున్నట్లు తెలిపారు. గత నెలలో ఆదిలాబాద్‌ జిల్లాలో కృష్ణగౌడ్‌ తండ్రి శంకర్‌గౌడ్‌ గంజాయి రవాణాలో అరెస్ట్‌ కాగా అక్కడ మిగిలిన గంజాయిని ఈ ప్రాంతానికి తరలిస్తూ పట్టుబడ్డట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 785 గ్రాముల గంజాయితో పాటు ద్విచక్రవాహనం, 4 చరవాణులను స్వాధీనం చేసుకుని, దానిని సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. యువత చెడు మార్గంలో నడవకూడదని, నిషేధిత గంజాయితో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సీఐ శ్రీను సూచించారు. మల్లాపూర్‌ ఎస్సై రాజేందర్‌, పోలీసుల పనితీరును ఉన్నత అధికారులకు రివార్డుల కోసం పంపించనున్నట్లు తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని