logo
Published : 30/11/2021 03:21 IST

రక్తహీనత లేని జిల్లానే లక్ష్యం

జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌

గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న జిల్లా పాలనాధికారి కర్ణన్‌, జిల్లా అధికారులు

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: బాలికలు, మహిళల్లో రక్తహీనత లేని జిల్లాగా మార్చాలని, కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌ పిలుపునిచ్చారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్‌ కరీంనగర్‌పై అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగినులు, మహిళా ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలలో చదివే బాలికలు, 14 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యగల మహిళలందరికీ రక్తహీనత పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 21వరకు రక్తహీనత పరీక్షలు జరపాలన్నారు. అనంతరం రక్తహీనత-తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ ముద్రించిన మూడు రకాల గోడ ప్రతులను ఆవిష్కరించారు. జడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా సంక్షేమాధికారి బి.రవీందర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జువేరియా, డీఆర్‌డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, డీసీవో శ్రీమాల, మార్కెటింగ్‌ శాఖ ఏడీ పద్మావతి, నగరపాలక కమిషనర్‌ డా.ఎన్‌.యాదగిరిరావు, డీఈఓ జనార్దన్‌రావు, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని