logo
Published : 30/11/2021 03:28 IST

చిత్ర వార్తలు

లారీ.. ప్రమాదకారి

నగునూరులోని ఓ పెట్రోల్‌ బంక్‌ ఎదుట రెండేళ్ల క్రితం ఓ లారీ మరమ్మతుకు రావడంతో అక్కడే వదిలేశారు దాని యజమాని. అప్పటి నుంచి రోడ్డు పక్కన ప్రమాదకరంగా మారింది. పిచ్చి మొక్కలు పెరిగి లారీని కప్పేశాయి. లారీని తొలగించేలా  పోలీసులు చర్యలు  చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కరీంనగర్‌ గ్రామీణం


తుప్పు పడుతున్నా.. పట్టించుకోరా?

సిరిసిల్లలో సమాచార పౌర సంబంధాల శాఖ వాహనాన్ని మూలన పడేశారు. వాహనం తుప్పు పడుతోంది. రూ.లక్ష వెచ్చిస్తే ఉపయోగంలోకి వచ్చే ఈ వాహనాన్ని మరమ్మతులు చేయించక మూలన పడేశారు. ప్రభుత్వ వాహనం కావడంతో ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. అదే సొంత వాహనం అయితే అధికారులు ఇలానే వదిలి వేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాన్ని నాలుగేళ్ల నుంచి మూలన పడవేశారు. వాహనం అంతా బాగే ఉన్న చిన్నపాటి మరమ్మతులు ఉండడంతో మూలన పడవేయడం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచింది.

-న్యూస్‌టుడే, సిరిసిల్లపట్టణం


రోడ్డు పక్కనే పొంచి ఉన్న ముప్పు

జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని కొత్తపల్లి నుంచి వావిలాల వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కొత్తపల్లి శివారులో గతంలో నిర్మాణం చేపట్టిన కల్వర్టు వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ ప్రమాదకరంగా మారింది. ధర్మారం, శాయంపేట, నాగంపేట, తనుగుల, పాపక్కపల్లి, వావిలాల, నగురం, నాగారం గ్రామాలతో పాటు ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాలకు చెందిన వాహనదారులు నిత్యం ఈ మార్గం నుంచి వెళ్తుంటారు. రహదారిపై ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు వద్ద రాత్రి వేళలో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు వద్ద రక్షణ గోడ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, జమ్మికుంట గ్రామీణం

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని