logo
Updated : 01/12/2021 03:48 IST

స్త్రీనిధి రుణాల్లో గోల్‌మాల్‌

సొంత అవసరాలకు మళ్లింపు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌

వైపు బినామీ సంఘాల వ్యవహారం కొలిక్కి రాకముందే.. మరోవైపు స్త్రీనిధి రుణాల చెల్లింపులో గోల్‌మాల్‌ జరిగినట్లు  తెలుస్తోంది. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతోనే ఈ అక్రమాలన్నీ బయట పడుతున్నాయి. సభ్యులు రుణ వాయిదాల డబ్బులు అధ్యక్షురాలికి అందజేస్తున్నా ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది. భారీగా బాకాయిలు ఉన్న సంఘాల జాబితా పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో నగరపాలికలు, మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో స్వశక్తి సంఘాలు పని చేస్తున్నాయి. మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవడానికి బ్యాంకు లింకేజీ, వ్యక్తిగత రుణాలు, స్త్రీనిధి రుణాలు వంటివి మంజూరు చేస్తారు. బ్యాంకు లింకేజీ, వ్యక్తిగత రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తుండగా స్త్రీనిధి రుణాలు బ్యాంకులతో సంబంధం లేకుండా తీసుకునే అవకాశం కల్పించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 4,048 సంఘాలు ఉండగా ఇందులో 154 సమాఖ్యలు పని చేస్తున్నాయి. సమాఖ్యలు అన్నీ కలిపి పట్టణ సమాఖ్య ద్వారా స్త్రీనిధికి వాటా ధనం తీసుకుంటారు. సమృద్ధి పొదుపు ద్వారా సమాఖ్యకు రుణాలు తీసుకోవడానికి అర్హత లభిస్తుంది. దీనికి మొబైల్‌ యాప్‌ ఉండగా అందులోనే సమాఖ్యలోని సంఘాలు, సభ్యుల పేర్లను నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌లోనే తీసుకోవడానికి రిక్వెస్ట్‌ పెడితే సరిపోతుంది. దీనికంటే ముందు సమాఖ్యలోని సంఘాల సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది. సంఘంలో పదిమంది ఉంటే 8 మందికే రుణాన్ని మంజూరు చేస్తారు. రుణ పరిమితి రూ.3లక్షలు మాత్రమే ఉండగా ఉపాధి అవకాశాల కోసం అయితే రూ.2లక్షలు మంజూరవుతోంది. లేదంటే రూ.50వేలు ఇస్తారు. దీనిని ఏడాదిలోగా తీసుకున్న మొత్తాన్ని స్త్రీనిధి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా 48గంటల్లో రుణం జమ అవుతోంది.

సొంత ఖాతాలకు రుణ చెల్లింపులు
కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో స్త్రీనిధి కింద తీసుకున్న రుణాలు సొంత ఖాతాలకు మళ్లించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రుణ మొత్తం తక్కువ మొత్తంలోనే ఉండగా సంఘాలకు మాత్రం వడ్డీ ఎక్కువయ్యే అవకాశముంటుంది. సంఘాల సభ్యుల నుంచి తిరిగి రుణం వసూలు చేస్తుండగా ఆ మొత్తాన్ని కొన్ని సమాఖ్యలు, కొందరు ఆర్పీలు స్త్రీనిధి ఖాతాలో జమ చేయడం లేదంటున్నారు. ఒక్కొక్క సమాఖ్య నుంచి రూ.1.93 లక్షల నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.

ఆగమేఘాల మీద చెల్లింపు
స్త్రీనిధి అధికారులు సమాఖ్యల వారీగా ఆడిట్‌ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా 8 సమాఖ్యలకు సంబంధించి బకాయిలు పేరుకుపోవడంతో వివరాలు సేకరించారు. ఇందులో ఐదు సమాఖ్యలు రుణ మొత్తాన్ని జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లుగా తేలింది. ఇంకేముంది సంబంధిత విభాగం ఆధ్వర్యంలో రికవరీ చేసేందుకు చర్యలు చేపడుతున్న సమయంలో మూడు సమాఖ్యలు ఆగమేఘాల మీద రూ.7లక్షల వరకు చెల్లించినట్లుగా చెబుతున్నారు. మిగతా సమాఖ్యలలో కూడా ఇలాగే పెండింగ్‌ ఉండగా వీటిని చెల్లించేందుకు గడువు కోరినట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా బినామీ సంఘాలలో జరిగిన అవకతవకలపై వస్తున్న ఫిర్యాదులు, ఉన్నతాధికారుల విచారణ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో పేరుకుపోయిన స్త్రీనిధి రుణాలు కూడా ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సమాచారం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని