logo
Updated : 01/12/2021 04:45 IST

పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలి

భాజపా ఆధ్వర్యంలో నిరసనలు

కోర్టుచౌరస్తాలో నిరసన తెలుపుతున్న భాజపా నాయకులు

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: పెట్రో ఉత్పత్తులపై వ్యాÆట్ తగ్గించడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కరీంనగర్‌లో భాజపా వెస్ట్‌జోన్‌ శాఖ ఆధ్వర్యంలో కోర్టుచౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్రాల వాటాను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. కావాలనే కేసీఆర్‌ కేంద్రంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. వెస్ట్‌జోన్‌ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్‌, కచ్చురవి, నాయకులు నాయిని మల్లేషం, జానపట్ల స్వామి, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాష్‌, ఎం.ప్రవీణ్‌, ఎస్‌.సంపత్‌, ఎం.చైతన్య, కిరణ్‌, మధు పాల్గొన్నారు.

* పెట్రోలు, డీజిల్‌పై వ్యాÆట్ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌లో భాజపా నార్త్‌జోన్‌ శాఖ అధ్యక్షుడు పాదం శివరాజ్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌, నాయకులు ఆనంద్‌, శ్రీనివాస్‌, కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు. భాజపా ఈస్ట్‌జోన్‌ అధ్యక్షుడు అవదుర్తి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టవర్‌సర్కిల్‌ వద్ద, కమాన్‌ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్‌కుమార్‌ ఆధ్వర్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని