logo
Published : 01/12/2021 03:46 IST

ఆర్టీసీ రక్తదాన శిబిరానికి స్పందన


రక్తదానం చేస్తున్న ఉద్యోగులు

కరీంనగర్‌ రవాణా విభాగం, న్యూస్‌టుడే: టీఎస్‌ ఆర్టీసీ, రెడ్‌క్రాస్‌ సహకారంతో మంగళవారం కరీంనగర్‌ బస్టాండ్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. కరీంనగర్‌ ఒకటో, రెండో డిపో, వర్క్‌షాపు సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏసీపీ తుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చని చెప్పారు. ఆర్‌ఎం అంచూరి శ్రీధర్‌ మాట్లాడుతూ తలసేమియా బాధితులకు రక్తం కొరత లేకుండా చూడటంలో భాగంగా సంస్థ ఎండీ పిలుపు మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ఉద్యోగులు, సిబ్బందితో పాటు ప్రయాణికులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రీజియన్‌లో పది డిపోల పరిధిలో 327 మంది రక్తదానం చేసినట్లు చెప్పారు.  చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీవీఎం రవిశంకర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ జి.తిరుమల్‌గౌడ్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ఛైర్మన్‌ పెండ్యాల కేశవరెడ్డి, కార్యదర్శి ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, డీఎంలు అర్పిత, లక్కు మల్లేషం, యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నర్సింగారావు, ఏజీఎం రాధాకిషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజర్‌ కరుణాకర్‌, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని