logo
Published : 01/12/2021 03:46 IST

నత్తనడకన అభివృద్ధి పనులు

తవ్వి వదిలేయడంతో సమీప ఇళ్లకు ప్రమాదం
న్యూస్‌టుడే, సుభాష్‌నగర్‌

సప్తగిరికాలనీలో ఎనిమిది నెలల కిందట డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వారు. ఇందుల్లోంచి మురుగునీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేయడంతో ఇంటి ప్రహారీ కూలి పునాదుల్లోకి నీరు చేరింది. గోడలు పగుళ్లు పెట్టాయి. నీటిని తోడటం ఆలస్యం చేస్తే ఇల్లు కుంగి ప్రమాదకరంగా మారేది.

రీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఓ వైపు అభివృద్ధి పనులు చేస్తుండగా.. మరోవైపు అసంపూర్తి పనులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా గోదాంగడ్డ నుంచి కశ్మీర్‌గడ్డ, శ్రీనగర్‌కాలనీ, సప్తగిరికాలనీ మీదుగా టెలిఫోన్‌ క్వార్టర్స్‌ వైపు పలు చోట్ల పనులు ఆగిపోయాయి. రోడ్డు పనులు పూర్తి చేయగా డ్రైనేజీ పనుల్లో అడ్డంకులు వచ్చాయి. వీటిని పలుమార్లు పరిశీలించిన ఉన్నతాధికారులు వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. రోడ్డుకు ఒకవైపు పూర్తిస్థాయిలో చేయగా మరోవైపు ఎక్కడ పడితే అక్కడ ఆ పనులు ఆగిపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కూలిన ఇంటి పునాదులు
సప్తగిరికాలనీలో ఎనిమిది నెలల కిందట డ్రైనేజీ కోసం తవ్వి వదిలేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న మురుగునీటితో ఆ ఇంటి గోడలు, పునాదులు తడిసి మట్టి కొట్టుకొని పోయింది. పునాది ప్రమాదకరంగా మారడంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ట్రాక్టర్‌ ద్వారా మురుగునీటిని నిరంతరం తోడుతుండగా నీరు మాత్రం తగ్గడం లేదు. పనులు చేయడంలో ఆలస్యం చేస్తున్నారని ఆ ప్రాంతవాసుల ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి రహదారి మూసి వేయడంతో రాకపోకలు సాగించే ప్రజలు అవస్థలు పడుతున్నారు.

శ్రీనగర్‌కాలనీలోని ఎంఆర్‌ గార్డెన్‌ సమీపంలో అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగించారు. మురుగు కాల్వ నిర్మించకుండా రేపు, మాపూ అంటూ ఆరు నెలలుగా వదిలేశారు. ఎలాంటి సమస్యలు లేనప్పటికీ పనులు చేయడంలో జాప్యం చేస్తున్నారు.

అంధకారంలో వీధులు
నగర పరిధిలోని స్మార్ట్‌ వీధుల్లో పాత స్తంభాలు తొలగించడంతో వీధిలైట్లు తొలగిస్తున్నారు. వీధి దీపాల కోసం స్మార్ట్‌ స్తంభాలు వేస్తుండగా పనులు పూర్తయినా కనెక్షన్‌ ఇవ్వడం లేదు. కశ్మీర్‌గడ్డ నుంచి సప్తగిరికాలనీ వైపు రాత్రి పూట చీకటిగా ఉండటంతో రాకపోకలు సాగించే ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండు వైపులా నడకదారిపై టైల్స్‌ వేయగా అవి ఊడిపోతున్నాయి. అర్ధాంతరంగా వదిలేసిన పనులన్నీంటిని పూర్తి చేయిస్తే ఆ రహదారులు ఆకర్షణీయంగా ఉంటాయి.


ఆదేశాలు ఇస్తాం
- పి.వి.రామన్‌, ఈఈ, నగరపాలిక

ట్టణ ప్రణాళిక, విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు అడ్డుగా ఉండటంతో ఆలస్యం అవుతోంది. ఎక్కడైతే ఇబ్బందులు లేవో అక్కడ పనులు త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలిస్తాం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని