Published : 01 Dec 2021 03:46 IST
సెలవులో నగరపాలక కమిషనర్?
కార్పొరేషన్, న్యూస్‌టుడే: కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ ఎన్.యాదగిరిరావు సెలవులో వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరిగిన స్వచ్ఛసర్వేక్షణ్ సమావేశానికి హాజరైన ఆయన అక్కడి నుంచే సెలవులో వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ఆయన పనితీరుపై ఫిర్యాదులు వస్తుండటం, నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నట్లు తెలియడంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆగ్రహించినట్లు తెలిసింది. దీంతోనే కమిషనర్‌ను సెలవులో వెళ్లాలని పేర్కొన్నట్లు సమాచారం. కాగా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌కు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Tags :