logo
Published : 02/12/2021 03:06 IST

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

సమీక్షలో మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి కర్ణన్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఓటర్ల జాబితాను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ ఎన్నికల నిర్వహణ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో వీడియోకాన్ఫరెన్స్‌ జరిగిన అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యంతరాల గడువు ముగిసినందునా ఓటరు జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కరీంనగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ఈ నెల 10న జరుగనున్న దృష్ట్యా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. కరీంనగర్‌ జడ్పీ కార్యాలయం, హుజురాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లను తనిఖీ చేయాలన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ చేయాలని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ఓటర్లు అయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసకునేలా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు పాలనాధికారి జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, మానకొండూర్‌ ఈఆర్వో, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్‌ ఈఆర్వో, ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌, హుజూరాబాద్‌ ఈఆర్వో, ఆర్‌డీవో సీహెచ్‌ రవీందర్‌రెడ్డి, చొప్పదండి ఈఆర్వో, డీఆర్‌డీవో శ్రీలత, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని