logo
Published : 02/12/2021 03:06 IST

తగ్గుతున్న ధరలతో పత్తి రైతుల ఆవేదన

జమ్మికుంట, న్యూస్‌టుడే

జమ్మికుంట మార్కెట్‌లో పత్తికి బిడ్డింగ్‌ నిర్వహిస్తున్న వ్యాపారులు

పత్తి ధరలు తగ్గుతుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జమ్మికుంట మార్కెట్‌లో బుధవారం పత్తి ధరలు మరింత తగ్గాయి. 88 ట్రాలీల విడిపత్తి విక్రయానికి రాగా, క్వింటా రూ.7,900 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. గత వారం రోజులుగా పత్తి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరింత తగ్గుతాయనే ఆలోచనతో నిల్వ చేసిన విక్రయిస్తున్నామని పలువురు రైతులు అంటున్నారు. సీజన్‌ మొదటి నుంచే ధరలు అధికంగా పలుకుతుండటంతో స్థానిక మార్కెట్‌కు వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రైతులు పత్తిని విక్రయానికి తీసుకొస్తున్నారు. ఐదు రోజుల కిందట స్థానిక మార్కెట్‌లో పత్తి ధర రూ.8,350 పలకగా, తాజాగా రూ.7,600కు చేరింది. పత్తి గింజలు, బేల్‌ ధరల ప్రభావంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. పత్తి బిడ్డింగ్‌ను స్థానిక మార్కెట్‌ కార్యదర్శి జి.రెడ్డినాయక్‌ పరిశీలించారు.


ధరలు తగ్గుతాయనే విక్రయానికి తీసుకొచ్చా

-బి.వనిత, మహిళా రైతు

ధరలు మరింత తగ్గుతాయనే భయంతో ఇంట్లో నిల్వ చేసిన పత్తిని జమ్మికుంట మార్కెట్‌కు పత్తిని విక్రయానికి తీసుకొచ్ఛా క్వింటాలు రూ.7,800 ధర పలికింది. పది రోజులుగా పత్తి ధరలు తగ్గుతున్నాయి. స్థానిక మార్కెట్‌లో బిడ్డింగ్‌లో నిర్ణయించిన ధరను మిల్లుల్లో పలు కారణాలతో ధర రూ.100 నుంచి 150దాకా వ్యాపారులు తగ్గిస్తున్నారు. నాణ్యత లేదని ధరల్లో కోతలు విధిస్తున్నారు. మార్కెట్‌లో నిర్ణయించిన ధరల్లో కోతలు విధించకుండా మార్కెట్‌ పాలక కమిటీ, అధికారులు చర్యలు చేపట్టాలి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని