logo
Published : 02/12/2021 03:06 IST

మురుగు శుద్ధి ఎలా?

నగరంలో నిలిచిన ప్రక్రియ

మోటార్ల మరమ్మతుల్లో తప్పని జాప్యం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌.. సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌.. ఓడీఎఫ్‌++ ఇలా ఎందులో చూసినా మార్కులు సాధించి మిగతా నగరాలకు పోటీ పడుతున్న నగరపాలక సంస్థ.. ఆ మార్కులు సాధించే ఎస్టీపీ బాగోగులు చూసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు.. ఎప్పటికప్పుడూ నిర్వహణ చూడాల్సి ఉండగా..అదేదో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం మరుగున పడే పరిస్థితికి వస్తోంది.

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భూగర్భ డ్రైనేజీ పనులు రూ.76.50 కోట్లతో పూర్తి చేశారు. ఎన్నో అడ్డంకులు, సమస్యల మధ్య దీనిని ప్రారంభించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టును మధ్యలో నిలిపి వేయకుండా అప్పటి పాలనాధికారి, ప్రస్తుత సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ప్రత్యేక దృష్టిసారించి నిధులు కూడా మంజూరు చేయించారు. ఫలితంగా పనులు పూర్తి చేసి పలు డివిజన్లకు ఇంటింటా కనెక్షన్లు ఇచ్చారు.

రోజుకు 4ఎంఎల్‌డీలు..

నగర శివారులోని గోపాల్‌ చెరువు దగ్గర నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) 38 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మించారు. 319.5 కిలో మీటర్లు పైపులైను వేశారు. మొత్తం 7,120 ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు నిర్మించగా 3,520 ఇళ్ల నుంచి మురుగునీటిని తీసుకుంటున్నారు. రెండు ప్రధాన ట్రంకు లైన్ల మీదుగా వచ్చే మురుగును ప్రతిరోజు రెండు నుంచి నాలుగు ఎంఎల్‌డీలు వస్తుండగా దానిని శుద్ధి చేసి సమీప చెరువులోకి వదులుతున్నారు.

* సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్టీపీ) గత రెండు నెలలుగా పని చేయడం లేదు. నెల రోజుల కిందట సఫాయిమిత్ర ఛాలెంజ్‌లో తనిఖీలకు వస్తుండటంతో నడిపించేందుకు ప్రయత్నించగా పది నిమిషాల్లో ఆగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన కమిషనర్‌ యాదగిరిరావు నిర్వహణ పట్టించుకోకపోవడంపై ఆగ్రహించారు. ఇందులో మొత్తం ఐదు మోటార్లు ఉండగా అవి పాడయ్యాయి. అదేవిధంగా అక్కడ కొన్ని రకాల సాంకేతిక సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా వాటిని కూడా ఏర్పాటు చేయడం లేదు. చిన్న, చిన్న మరమ్మతులు కూడా అటకెక్కించారు.

ప్లాంట్‌లో నిలిచి ఉన్న మురుగునీరు

ప్లాంట్‌లోనే నిలిచి..

ప్రతిరోజు ఇళ్లు, సెప్టిక్‌ట్యాంకర్ల నుంచి వచ్చే మురుగునీరు, వ్యర్థాలన్నీ ప్లాంట్‌లో నిలిచింది. పైపులలో నిండా నీరే ఉంది. రెండు ట్రంకు లైన్ల నుంచి వచ్చే మురుగు ఎస్టీపీలోని బావిలోకి వచ్చి చేరుతోంది. ఎప్పటికప్పుడూ శుద్ధి జరగడం లేదు. ఇంకొద్ది రోజులు ఆగితే మురుగునీరంతా పైపులైన్‌లలో నిలిచి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు చోట్ల యూజీడీ ఛాంబర్లు పొంగి పోర్లుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో దుర్వాసన వస్తుండగా జెట్టింగ్‌ మిషన్‌, ట్రాక్టర్లతో నీటిని తోడేస్తున్నారు.

ఎస్టీపీలో మురుగు శుద్ధి చేయడం ఆలస్యం చేస్తే దుర్వాసన వ్యాపించే అవకాశముంటుంది. మోటార్లను వెంటనే తెప్పించి ప్లాంట్‌ను నడిపిస్తే తప్ప పరిస్థితి మెరుగు పడదు. అయినప్పటికీ గత కొద్ది నెలలుగా మూతపడి ఉండటంతో మళ్లీ నడిపించే సమయంలో దుర్వాసన వచ్చి ఇబ్బందులు రాక తప్పదు.

15 రోజుల్లో కొత్తవి బిగిస్తాం : - ఓంప్రకాశ్‌, డీఈఈ, నగరపాలిక

ఎస్టీపీలో పని చేస్తున్న మోటార్లు ఒకసారి ఇబ్బందులు వస్తే మరమ్మతులు చేయించాం. కొద్ది రోజులకే ఆకస్మికంగా నిలిచి పోయాయి. పాత వాటిని మరమ్మతులు చేయకుండా కొత్తవే కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌ ఇచ్చాం. 15 రోజుల్లో రాగానే బిగించడం జరుగుతుంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని