logo
Published : 02/12/2021 03:06 IST

ధాన్యం కొనుగోలులో దాగుడుమూతలు

ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ధ్వజం

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, చిత్రంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారని కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యం ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతుంటే మంత్రికి కనిపించడం లేదని విమర్శించారు. తేమశాతం అధికంగా ఉందని తరుగు తీస్తుండటంతో ప్రతీ క్వింటాలుకు రూ.120 రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కై రైతులను నిలువుగా దోపిడీ చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో వరిధాన్యం సేకరణలో మిల్లర్ల దోపిడీకి గురవుతున్న రైతాంగానికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం అందించినట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. 1955లో దేశ మొదటి ప్రధాని నెహ్రూ రైతు ప్రయోజనాల కోసం ఎఫ్‌సీఐ ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకపోగా రెండు పార్టీల ప్రభుత్వాలు ధాన్యం విషయంలో కోట్లాట పెడుతున్నాయని విమర్శించారు. రైతులు కుప్పల మీదనే చనిపోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం క్యాంపు రాజకీయాల్లో మునిగి పోయారన్నారు. ఎంపీగా బండి సంజయ్‌ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. డిసెంబర్‌ 15లోగా కొనుగోలు పూర్తి చేయకపోతే జిల్లాలో వరి దీక్షలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మేడిపల్లి సత్యం తదితరులు ఉన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని