logo
Published : 02/12/2021 03:06 IST

ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడి మహిళ మృతి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడగా భార్య మృతిచెందగా, భర్తకు స్వల్ప గాయాలైన ఘటన మండలంలోని వర్షకొండ గ్రామశివారులో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన లక్కంపల్లి గంగారం, ముత్తమ్మ(58) దంపతులు వారి ద్విచక్ర వాహనంపై మండలంలోని వర్షకొండ గ్రామంలో ఉంటున్న వారి కూతురు ఇంటికి బుధవారం మధ్యాహ్నం వచ్చి, రాత్రి తిరుగు పయనమయ్యారు. గ్రామశివారులో రహదారిపై ఉన్న వరి ధాన్యం రాశిపైకి ప్రమాదవశాత్తు వారి దిచక్ర వాహనం వెళ్లడంతో కిందపడిపోడగా, ముత్తమ్మ తలకు తీవ్ర గాయాలై మరణించగా, గంగారం స్వల్ప గాయాల పాలయ్యాడు.


లారీని ఢీకొని యువకుడి దుర్మరణం

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మారుతినగర్‌ శివారులో జరిగింది. ఎస్సై సదాకర్‌ కథనం మేరకు కోరుట్ల పట్టణానికి చెందిన మల్లెల క్రాంతికుమార్‌(35) మెట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంపై కోరుట్లకు వెళ్తుండగా మారుతినగర్‌ శివారులో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో క్రాంతికుమార్‌ దర్మరణం చెందాడని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని