logo
Published : 02/12/2021 03:06 IST

అప్పు తీర్చలేదని వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: అప్పు చెల్లించనందుకు సమీప బంధువే మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలం పొగాకులపల్లెకు చెందిన ముంజం రాజు బతుకుదెరువు కోసం కరీంనగర్‌కు వచ్చి కాపువాడలో స్థిరపడ్డారు. అతనికి భార్య అరుణ(45), ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు, కోడలు ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. రాజు ఆర్టీసీలో ఒప్పంద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో రాజు, అరుణలు తమ సమీప బంధువు ముంజం కనకయ్య వద్ద రూ.10వేలు అప్పుగా తీసుకున్నారు. తీర్చడం ఆలస్యం కావడంతో వడ్డీ కలుపుకుని రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. రెండు రోజులుగా అప్పు చెల్లించాలని, లేని పక్షంలో అందరి ముందు పరువు తీస్తానంటూ కనకయ్య వేధించడంతో భయాందోళనకు గురైన అరుణ బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్‌ ఒకటో ఠాణా ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని