logo
Published : 02/12/2021 03:06 IST

చిత్ర వార్తలు

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి

కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోంది. భారీ వాహనాలు రోడ్డుపై వెళుతున్న సమయంలో భారీగా దుమ్ము లేవడంతో దారి కనిపించడం లేదు. వాహన చోదకులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో ట్యాంకర్లతో నీళ్లు చల్లాల్సిన గుత్తేదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

-న్యూస్‌టుడే, కొత్తపల్లి(కరీంనగర్‌)


అవసరం సరే.. ఆపద పట్టదా!

 

వ్యవసాయ అవసరాలకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు అందిస్తున్నా క్షేత్ర స్థాయిలో సరిపడా సిబ్బంది లేక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నియంత్రికల వద్ద రైతులే సొంతంగా మరమ్మతు చేసుకోవడం, ఫ్యూజులు సరిచేసుకోవడం పరిపాటిగా మారింది. బుధవారం ధర్మారం మండలం నందిమేడారానికి మిట్ట తిరుపతి తన పొలం వద్ద నియంత్రికపై ఊడిపోయిన తీగలను సొంతంగా సరిచేసి ఫ్యూజు వేసుకోవాల్సి వచ్చింది. హెవీ స్విచ్చు వద్ద సరఫరా నిలిపివేసి మరో రైతును కాపలా ఉంచి, తాను మరమ్మతు చేస్తున్నానని తిరుపతి వివరించారు. ప్రమాదం జరిగాక బాధ పడే బదులు అధికారులు ముందుజాగ్రత్తగా క్షేత్ర స్థాయి సిబ్బందితో మరమ్మతు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, ధర్మారం


కూలేందుకు సిద్ధం

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం ఇది. శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. కూల్చివేయాలని జడ్పీ ఇంజినీరింగ్‌ అధికారులు గతంలోనే సూచించారు. ఏడాదిన్నర క్రితం చేపట్టిన కొత్త భవన నిర్మాణం ఆగిపోవడంతో తరగతులు ఇందులోనే కొనసాగుతున్నాయి. ఈ భవనంలో తరగతులు నిర్వహించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

-న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

 


మాస్క్‌ వాడకం ఇలా..

 

హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే చాలా మంది చలాన్ల బారి నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనం నెంబర్‌లోని అంకెలను తొలగిస్తూ ట్రాఫిక్‌ పోలీసు కెమెరా నుంచి తప్పించుకుంటున్నారు. ఓ వాహనదారుడు మూతికి కట్టాల్సిన మాస్కును ఏకంగా నెంబర్‌ ప్లేట్‌కు తగిలించి ఇలా వాహనం నెంబర్‌ కనిపించకుండా చేశాడు.

-న్యూస్‌టుడే, జగిత్యాల


కూడలి ఇలా... రాకపోకలు ఎలా?

వేములవాడ గ్రామీణ మండలంలోని వట్టెంల కూడలి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వేములవాడ నుంచి కొండగట్టుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా ఈ కూడలిని అభివృద్ధి చేయడం లేదు. దీంతో ఇక్కడ భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, వేములవాడ గ్రామీణం

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని