logo
Published : 02/12/2021 03:38 IST

కొండగట్టు క్షేత్రం.. సమస్యల నిలయం


గతంలో బాగున్న నల్లాల వద్ద గోడలు కూల్చివేసి మళ్లీ చేపట్టిన పనులు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిధిలో చేపట్టే నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించి ఏళ్ల తరబడి కొనసాగుతుండగా.. మరికొన్ని పనులు అస్తవ్యస్తంగా భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో పగిలిన టైల్స్‌, నాపరాళ్లు, కుంగిన మురుగు కాలువ ఛాంబర్స్‌, శిథిలమైన సీసీ రహదారులు అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శంగా ఉన్నాయి. ఆలయం ముందు మురుగు కాలువ ఛాంబర్స్‌పైన కప్పులు కుంగిపోగా మరోచోట ఎత్తయిన సిమెంటు కప్పు అమర్చడంతో తట్టుకొని పడుతున్నట్లు భక్తులు తెలిపారు. నీటి వసతి కోసం నిర్మించిన నల్లాలు, గోడలను ఇటీవల కూల్చివేయించి మళ్లీ నిర్మాణం చేపట్టారు. సీతమ్మ కన్నీరు ప్రాంతం నుంచి నడచివచ్చే సీసీ రహదారి పూర్తిగా శిథిలమైంది. కల్యాణకట్ట, భక్తులు నివసించే డార్మిటరీ హాళ్లలో నాపరాళ్లు పగిలిపోవడంతో మట్టినేలగా మారాయి. ఆలయ పరిసరాలను అందంగా పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు.


మురుగు వెళ్లే పైపులైను ఛాంబర్‌పై ఎత్తయిన కప్పు

డార్మిటరీహాలులో తేలిన మట్టి

-మల్యాల, న్యూస్‌టుడే

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని