logo
Published : 02/12/2021 03:38 IST

సోయా రైతు.. మార్కెట్‌ మాయాజాలంతో చిత్తు

పంట చేయి దాటాక పెరుగుతున్న ధర

మెట్‌పల్లి, న్యూస్‌టుడే


మేడిపల్లిలో రైతు ఇంట్లో నిల్వ చేసిన సోయా

ప్రకృతి ప్రకోపం..వ్యాపారులు, దళారుల మాయాజాలంతో ధరలను అంచనా వేయలేక సోయా రైతులు నష్టపోతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేయిదాటాక ధర పెరుగుతుండడంతో అమ్ముకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా నిల్వ చేసుకున్న కొంత మంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తన్నారు. జిల్లాలో సోయాసాగు, నష్టాలు, తగ్గిన దిగుబడులు, పెరిగిన ధరలపై ‘న్యూస్‌టుడే’ కథనం..

అమ్మకాలకు దళారులే దిక్కు

జిల్లాలో మెట్‌పల్లి, ఇబ్రపీీాంపట్నం, మల్లాపూర్‌, కథలాపూర్‌, మేడిపల్లి, రాయికల్‌ జగిత్యాల, సారంగాపూర్‌ మండలాల్లో సోయా సాగు చేస్తారు. జిల్లాలో సోయా సాధారణ సాగు విస్తీర్ణం 25,572 ఎకరాలు కాగా గత ఏడాది 6వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది సాగు విసీ్తీర్ణం గణనీయంగా తగ్గింది. 2,833 ఎకారల్లో సాగు చేశారు. కోత దశలో కురిసిన వర్షాలు రైతులకు నిండా ముంచాయి. దీంతో ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సగటున 22వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సాగుకు ఎకరాకు రూ.6వేల వరకు ఖర్చు చేశారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.3,950 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పంటను దళారులకు విక్రయించక తప్పలేదు.

ఎకరానికి రూ.16వేల నష్టం

పంట చేలో ఉన్న సమయంలో క్వింటాలుకు రూ.8 నుంచి 10 వేలకు పైగా ధరపలికింది. దీంతో రైతులు సంబరపడ్డారు. పంట చేతికొచ్చేసరికి వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ధర గణనీయంగా పడిపోయింది. క్వింటాలుకు రూ.5 వేలకు చేరుకోవడంతో రైతులను కలవరపరిచింది. అప్పుల భారం భరించలేక ధర ఇంకా తగ్గిపోతుందని భావించిన అధికశాతం రైతులు పంటను రూ.4,500కు విక్రయాంచారు. పంట రైతుల చేయిదాటి వ్యాపారుల వద్దకు చేరిన తర్వాత క్రమంగా ధర పెరిగింది. మహారాష్ట్ర మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.6,500లకు చేరుకుంది. దీంతో ఉత్పత్తులు విక్రయించకుండా దాచుకున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తంలో దాదాపు 15వేల క్వింటాళ్ల వరకు సోయా అమ్మకాలు జరిగాయి. మద్దతు ధర కంటె ఎక్కువ ధర లభించినా ప్రస్తుత మార్కెట్‌ ధరను పరిశీలిస్తే ముందుగా తక్కువ ధరకు అమ్ముకొని క్వింటాలుకు రూ.2000 వంతున ఎకరానికి సుమారు రూ.16 వేల వరకు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వ్యాపారుల సిండికేటుతో నష్టం

- అల్లూరి మహేందర్‌, వేంపేట, రైతు

ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విపరీతంగా పెరిగాయి. రూ.6వేలకు పైగా ఖర్చు చేసి సోయా సాగుచేశా. పంట చేలో ఉన్నప్పుడు క్వింటాలుకు రూ.8వేలకు పైగా పలకడంతో మంచి ధర వస్తుందని ఆశించా. పంట చేతికి వచ్చాక వ్యాపారులు సిండికేటుగా మారి ధరను తగ్గించడంతో నష్టపోయాం. ధర తగ్గుతుందని గత్యంతరంలేక గ్రామంలోనే క్వింటాలుకు రూ.4వేల వంతున 10 క్వింటాళ్లు విక్రయించా. ప్రభుత్వం అందిస్తున్న ధర గిట్టుబాటు కావండంలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని