logo
Published : 02/12/2021 03:38 IST

లావాదేవీలపై అనిశా విచారణ

నగరపాలక అధికారులపై దృష్టి

రాత్రంతా కార్యాలయంలో సోదాలు

గోదావరిఖని, న్యూస్‌టుడే : పెద్దపల్లి ఆర్డీఓ, రామగుండం నగరపాలక ఇన్‌ఛార్జీ కమిషనర్‌ శంకర్‌కుమార్‌ అనిశాకు చిక్కిన నేపథ్యంలో రాత్రంతా విచారణ సాగింది. మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలో పట్టుబడ్డ శంకర్‌ కుమార్‌ను అక్కడే రాత్రి వరకు విచారణ చేసిన అనిశా అధికారులు ఆ తర్వాత నగరపాలక కార్యాలయానికి తీసుకువచ్చారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సోదాలు చేశారు. నగరపాలక ఇంజినీరింగ్‌, పరిపాలన విభాగం అధికారుల నుంచి వివరాలు సేకరించారు. రాత్రి 1 గంట వరకు కార్యాలయంలోనే ఉన్న అనిశా అధికారులు పలు కోణాల్లో వివరాలు సేకరించారు. పనుల కేటాయింపు, టెండర్లకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. బుధవారం నగరపాలక అధికారులతో అనిశా అధికారులు మాట్లాడారు. అవినీతి వ్యవహారంలో ఎవరికి ప్రమేయం ఉందన్న కోణంలో విచారణ చేశారు. లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఆర్డీఓ శంకర్‌ కుమార్‌ వ్యవహారంలో నగరపాలక అధికారుల్లో ఎవరికైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో వివరాలు సేకరించారు. పనులకు సంబంధించిన పాత దస్త్రాలు, బిల్లు రికార్డులను అనిశా అధికారులు పరిశీలించారు. పక్కన పెట్టిన పనులను తిరిగి కేటాయిస్తున్న క్రమంలోనే ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఇందులో ఇంకా ఏమైనా అవినీతి వ్యవహారం వెలుగు చూస్తుందా అన్న కోణంలో అనిశా అధికారులు దృష్టి సారించారు. నగరపాలక కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారంపై ఇది వరకే అనిశా అధికారులకు సమాచారం ఉంది. ఒకరిద్దరు అధికారులపై కూడా అనిశా అధికారులు దృష్టి సారించారు. తాజాగా ఇన్‌ఛార్జీ కమిషనర్‌ శంకర్‌కుమార్‌ అవినీతి వ్యవహారంలో చిక్కడంతో నగరపాలక కార్యాలయంలో మరికొన్ని అవినీతి చేపలను బయటకు తీసుకువచ్చేందుకు అనిశా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని