logo
Published : 02/12/2021 03:38 IST

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ‘ఇసుక మేట- కాసుల వేట’ అనే శీర్షికన ఈ నెల 1న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న వాటిని సీజ్‌ చేసినట్లు ఎస్సై తెలిపారు. ముస్తాబాద్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన ట్రాక్టరు డ్రైవర్లు నాగరాజు, బంటు దీపక్‌, యజమాని సురేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని