logo
Published : 03/12/2021 02:38 IST

ఏటీఎంలలో అనధికారికంగా రూ.15.3 లక్షల విత్‌డ్రా

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : పలు ఏటీఎంలలో డబ్బులు జమ చేసే వ్యక్తులు అనధికారికంగా రూ.15.3 లక్షల నగదు ఉపసంహరణలు చేపట్టారని, ఇందులో ఎన్టీపీసీ ప్రాంతంలో రూ.4.9 లక్షలు తీసుకున్నారని ఎస్బీఐ రామగుండం శాఖ చీఫ్‌ మేనేజర్‌ ఎన్‌.శివశంకర్‌రావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అక్టోబరు 12 నుంచి 30 వరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ఏటీఎంలలో కొందరు వ్యక్తులు నగదు జమ చేస్తూ అనధికారికంగా రూ.15.3 లక్షలు తీసుకున్నట్లు ఎస్బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఫిర్యాదు చేశారు. 173 సార్లు ఈ నగదు ఉపసంహరణలు చేపట్టినట్లు గుర్తించినట్లు వివరించారు. అనధికారికంగా నగదు తీసుకున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని