logo
Published : 03/12/2021 02:38 IST

విదేశీ విద్య... కల సాకారమిలా

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

ఉన్నత విద్యను విదేశాల్లో చదవడం ఉన్నత వర్గాల వారికే సాధ్యమవుతుంది. ఇది ఒప్పటి మాట.. అత్యుత్తమ మార్కులు సాధించి విదేశీ వర్సిటీల్లో సీటు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. ప్రతి ఏటా అంబేడ్కర్‌, మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యానిధి పథకంలో భాగంగా అన్నీ వర్గాల వారికి అవకాశం కల్పిస్తోంది.

ప్రతి ఏట విదేశాలలో చదువుకోవడానికి రెండుసార్లు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇతర దేశాలలో పీజీ కోర్సు, పీహెచ్‌డీ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో కనీసం 60శాతం మార్కులు ఉండాలి. ప్రతి ఏటా ప్రభుత్వం అన్నీ వర్గాల వారికి సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి అందులో మెరిట్‌ ఉన్నవారిని రిజర్వేషన్‌ ప్రకారం ఎంపిక చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల వారి వార్షికాదాయం రూ.1,50,000, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షల లోపు ఉండాలి. వయస్సు 30ఏళ్లలోపు ఉండాలి. ప్రతి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఇందులో ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా అక్కడికి వెళ్లి చదువుకోవాలి లేదంటే సీటు రద్దవుతుంది. మధ్యలో కోర్సు, యూనివర్సిటి మారే అవకాశం లేదు. అసంపూర్తిగా దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తారు. విద్యార్థులు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సెప్టెంబరు 30వరకు, మళ్లీ జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
ఈ పరీక్షల్లో మెరిట్‌ తప్పనిసరి
యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, ఇతర దేశాలలో చదవుకోవడానికి నిర్వహించే పలు పరీక్షల్లో కనీసం మెరిట్‌ సాధించాలి. టీఓఈఎఫ్‌ఎల్‌-60 (టోఫెల్‌), ఐఈఎల్‌టీఎస్‌-6.0, జీఆర్‌ఈ-260, జీఎమ్‌ఏటీ- 500, పీటీఈ-50 స్కోరు సాధించాల్సి ఉంటుంది.
 
 రిజర్వేషన్‌
బీసీ-ఏకు 29శాతం, బీసీ-బీకి 42, బీసీ-డీకి 29 ఇందులో మహిళలకు 33శాతం, 3శాతం అంగవైకల్య విద్యార్థులకు.
ఎంపిక ఎవరు చేస్తారు
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ ఛైర్మన్‌గా ఆయా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఉంటారు. సభ్యులుగా ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కౌన్సిల్‌ కార్యదర్శి, వైస్‌ ఛాన్స్‌లర్‌ జేఎన్‌టీయూ, కమిషనర్‌ ఎస్సీ డీడీ, కమిషనర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌, విదేశీ విద్యలో ఒక అనుభవజ్ఞుడు ఉంటారు.
రూ.20లక్షలు మంజూరు
విదేశీ విద్యానిధి పథకం కింద ప్రభుత్వం రూ.20లక్షలు మంజూరు చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత రూ.10లక్షలు, అక్కడ ఖర్చుల నిమిత్తం రూ.10లక్షలు చెల్లిస్తుంది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ ధరల ప్రకారం అదనంగా రూ.10లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టికెట్‌కు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి
తెలంగాణ ఈపాస్‌ వెబ్‌సైట్‌ నందు దరఖాస్తు చేసుకోవాలి. తప్పనిసరిగా పాస్‌పోర్టు ఉండాలి. జనన, కులం, ఆదాయం, నివాసం ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, ఈ-పాస్‌ ఐడీ నంబర్‌, పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ మెమోలు జతచేయాలి. వీటితోపాటు విదేశీ యూనివర్సిటి పరీక్షల్లో పాసైన పరీక్ష జాబితా, ఐ-20 ఫాం, ఇటీవల తీసుకున్న పన్ను లెక్కింపు ధ్రువీకరణ పత్రం, ఏదైనా జాతీయ బ్యాంకు ఖాతా, ఒక ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని