logo
Published : 03/12/2021 02:38 IST

ప్రసూతి సేవల్లో సిరిసిల్ల ఆసుపత్రి మేటి

నవంబరులో 324 ప్రసవాలు
న్యూస్‌టుడే, సిరిసిల్ల పట్టణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి

సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో కార్పొరేట్‌కు దీటుగా ప్రసూతి సేవలు అందిస్తున్నారు. గత నెలలో 324 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. ఈ ఆసుపత్రిలో 2020 మేలో అత్యధికంగా 315 కాగా, ఈ ఏడాది నవంబర్‌లో 324 కాన్పులు నిర్వహించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలు కల్పించడం, దీనికి తోడు వైద్యులు, సిబ్బంది మెరుగైన  వైద్య సేవలను అందిస్తుండటంతో ఆదరణ పెరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో అధునాతన పరికరాలు ఉండటంతో వైద్యులు, సిబ్బంది నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రసూతి సేవలపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఆసుపత్రిలో సీటీజీ, ఫిటల్‌డాప్లర్‌, అల్ట్రాసౌండ్‌ మిషన్‌ అధునాతన లేబొరేటరీ గది, హైడ్రాలిక్‌ ఆపరేషన్‌ టేబుళ్లు ఉన్నాయి. వీటికి తోడు బాలింతలకు కేసీఆర్‌ కిట్‌ అందించడం, ఇతర సదుపాయాలు ఉండటంతో గర్భిణులు ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో నవంబరులో 324 ప్రసవాలు నిర్వహించారు. వీటిలో 98 సాధారణ కాన్పులున్నాయి. అక్టోబర్‌లో 303 ప్రసవాలు జరిగాయి. పేదలు ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవాలు చేయించుకొని వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు పడకుండా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా కాన్పులు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

సిబ్బంది కొరతతో కొంత ఇబ్బంది
జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్‌లు ఉన్నప్పటికి వారిలో ఇద్దరు డిఫ్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఇద్దరు రెగ్యులర్‌ గైనకాలజిస్ట్‌లు ఉన్నట్లయితే ప్రసవాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముగ్గురు మిడ్‌వైపరి నర్సులు డిఫ్యూటేషన్‌పై పని చేశారు. అక్టోబర్‌లో వీరి డిఫ్యూటేషన్‌ పూర్తికావడంతో తిరిగివెళ్లిపోయారు. దీంతో నవంబర్‌లో సాధారణ ప్రసవాలు తక్కువగా జరిగాయి. వీటన్నింటికి తోడు ఆసుపత్రిలో బాలింతలకు 35 పడకలు మాత్రమే ఉన్నాయి. మరో 30 ఏర్పాటు చేస్తే పేదలకు ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.
   మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం
-డాక్టర్‌ తిరుపతి, ప్రసూతి విభాగం ఇన్‌ఛార్జి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో లేని పరికరాలు సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. ఎలాంటి అనుమానం లేకుండా కాన్పులు చేయించుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరగని ప్రసవాలు ప్రస్తుతం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అవుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ అన్ని రకాల పరికరాలను సమకూర్చారు. నవంబరులో 324 ప్రసవాలు చేసి రికార్డు సాధించాం.


 

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని