logo
Published : 03/12/2021 02:38 IST

ఆత్మవిశ్వాసం ముందు చిన్నబోయిన అంగవైకల్యం

ఈటీవీ, కరీంనగర్‌

పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు  జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన జి.శివలాల్‌.  మరుగుజ్జుగా మిగిలిపోయిన శివలాల్‌ తన లోపాన్ని మరిచి అందరిలా సైకిల్‌ తొక్కాలని, కారు నడపాలని పట్టుదలగా ప్రయత్నించే వాడు. తోటి వాళ్లు మాత్రం..సైకిల్‌ కూడా తొక్కలేడంటూ గెలిచేసేవారు. బీకాం వరకు చదువు పూర్తి చేయడమే కాకుండా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో అడ్మిన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.అతని భార్య చిన్మయి కూడా మరుగుజ్జే.ఒక కుమారుడున్నాడు.  కారు నడపాలని పట్టుదల ఉన్నప్పటికీ ఏ డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లినా కాళ్లు అందడం లేదు కదా..డ్రైవింగ్‌ సాధ్యం కాదని తేల్చి చెప్పేవారట. అయినా తన పట్టుదలను మాత్రం వీడలేదు.  ఈనేపథ్యంలో ఏడాది కిందట ఓ కారు కొని తన శరీరానికి అనుగుణంగా రీమోడలింగ్‌ చేయించుకున్నాడు. తరువాత తన స్నేహితుని సహాయంతో కారు నడపడం నేర్చుకున్నాడు. జనవరి మొదటి తేదీ నుంచి డ్రైవింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించిన శివలాల్‌ కేవలం నెలరోజుల్లోనే  ప్రావీణ్యం సంపాదించాడు. కారు నడుపుకుంటూ వెళ్లి మార్చి 12న డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు మరుగుజ్జులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయలేదు. దీంతో ఉన్నతాధికారులతో చర్చించి కొత్తగా లైసెన్స్‌  తెప్పించుకున్నాడు. రాష్ట్రంలో మొత్తం 400 మంది వరకు మరుగుజ్జులు ఉన్నా డిగ్రీ పొందిన వ్యక్తిగా,పర్మినెంట్‌ లైసెన్స్‌ పొందిన మొదటి వ్యక్తిగా వండర్‌ బుక్‌ఆఫ్‌ రికార్డుకు ఎక్కారు.
డ్రైవింగ్‌ స్కూల్‌ ఏర్పాటు లక్ష్యం
-శివలాల్‌

బాల్యం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. చదువులోనూ డ్రైవింగ్‌ శిక్షణలోను ఇబ్బంది పడ్డాను.చాలా మంది స్నేహితులు ఫోన్‌ చేస్తున్నారు.తమకు కూడా డ్రైవింగ్‌ నేర్పే విధంగా సూచించమని కోరుతున్నారు. ఒకరికి అంటే స్నేహితుడు నేర్పించారు.అందరికీ నేర్పడం సాధ్యం కాదు కదా..అందుకే మరుగుజ్జుల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడమే  లక్ష్యంగా పెట్టుకున్నా.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని