logo
Published : 03/12/2021 02:38 IST

ఆర్టీసీకి కాసులు కురిపించిన ‘కార్తికం’

వేములవాడ డిపోకు రూ. 2.74 కోట్ల ఆదాయం

వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కార్తిక మాసం పుణ్యమాని ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. నవంబరులో వేములవాడ డిపోకు రూ.2.74 కోట్ల ఆదాయం సమకూరింది. గత నెల డిపోలోని 63 బస్సులు 8,16,000 కిలోమీటర్లు తిరిగాయి. దాదాపు 4.80 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. కార్తిక మాసంలో వేములవాడ రాజన్న ఆలయానికి రోజూ భక్తుల రద్దీ పెద్ద ఎత్తున పెరిగింది. దీంతో డిపోకు భారీగా ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో డిపోకు రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు వచ్చేంది. కార్తిక మాసంలో రోజుకు సరాసరి రూ.9.30 లక్షల వరకు ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే రూ.40 లక్షలు అదనంగా వచ్చింది. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను తిప్పడంతో ఆదాయం చేకూరింది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని