logo
Published : 03/12/2021 02:38 IST

వేళ్లూనుకున్న నిర్లక్ష్యం

 పై వంతెనలకు నిర్వహణ కరవు

రైల్వే పైవంతెన గోడపై పెరుగుతున్న చెట్లు

న్యూస్‌టుడే, రామగుండం : రామగుండం పట్టణంలో నిర్మించిన రైల్వే పైవంతెన, భూగర్భ వంతెనల నిర్వహణను రహదారులు, భవనాలు, రైల్వే శాఖలు విస్మరించాయి.. రక్షణ, భద్రతపరంగా అటు వంతెనలకు, ఇటు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. రైల్వే ట్రాక్‌పైన పైవంతెన దారిపై చిన్న వర్షానికి నీరు నిలిచి వాహనాల రాకపోలకు ఇబ్బందవుతోంది. ఇక్కడ నీటి మళ్లింపు ఏర్పాట్లు లేక రోజుల తరబడి అక్కడే నిలుస్తోంది. నీటి నిల్వ కారణంగా సిమెంటు రహదారి పాడవుతోంది. పైవంతెనకు ఇరువైపులా అప్రొచ్‌ రహదారుల సపొర్టు గోడలపై ఇటుక రాళ్లు చీల్చుకుంటూ మర్రి, ఇతర చెట్లు పెరుగుతున్నాయి. నాలుగు వైపులా గోడలపై చెట్ల వేర్లు, పొదలు పాకి పెద్దవి అవుతున్నాయి. వీటి కారణంగా పగుళ్లు ఏర్పడి గోడల రక్షణ ప్రమాదకరంగా మారనుంది. పైవంతెన రహదారిపై పేరుకున్న మట్టి తొలగింపు, ఇరువైపులా గోడల పై, కింద, సర్వీసు దారుల పక్కన చెట్లు, పొదల తొలగింపు పనులను నాలుగేళ్లుగా చేపట్టడం లేదు. పాత రైల్వేగేటుపై నిర్మించిన భూగర్భ వంతెన రహదారి కాల్వను తలపిస్తోంది. వంతెనకు ఇరువైపులా దారులపై నీరు నిలిచి పాకురు పట్టడంతో వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్నారు. వంతెన రైల్వేట్రాక్‌ కింద ఉన్న దారి అడుగున్నర మేర మట్టి, నీరు నిలిచి కాల్వలా మారింది. పైపులైను నుంచి నీరు సక్రమంగా పారకపోవడంతో అక్కడే నిలుస్తోంది. నీటిలో కాల్వ దారిని దాటుకుంటూ వాహనదారులు వెళ్తున్నారు. రాత్రిపూట ఈ మార్గం నుంచి వెళ్లేందుకు భయపడ్తున్నారు. ఈ వంతెన పూర్తయి ఏడాది కావస్తున్నా మట్టి, నీరు తొలగించడంలేదు. నిర్మాణాలు పూర్తయ్యాక అయిదేళ్లపాటు గుత్తేదారులు వంతెనల నిర్వహణ, మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను వారితో చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని