logo
Published : 03/12/2021 02:38 IST

‘జనవరిలో 75 కోట్ల సూర్యనమస్కారాలు’

సచిన్‌జీని సత్కరిస్తున్న సుధాకర్‌జీ దంపతులు

ధర్మారం, న్యూస్‌టుడే: నిత్యం యోగా సాధనతో శారీరక, మానసిక సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుందని యువభారత్‌ జాతీయ అధ్యక్షుడు సచిన్‌జీ పేర్కొన్నారు. ధర్మారంలోని పతంజలి నిత్య యోగా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన యువభారత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేష్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యాసకులతో ఆసనాలు వేయించారు. సూర్యనమస్కారాలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. జనవరిలో వివేకానందుడి జయంత్యుత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 75 కోట్ల సూర్యనమస్కారాలు చేయించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని విద్యాసంస్థలతో పాటు గ్రామాల్లో ప్రచారం చేయాలని సచిన్‌జీ సూచించారు. ఏడాది కాలంగా యోగా తరగగతులు బోధిస్తున్న సుధాకర్‌జీ-మంజుల దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా సచిన్‌జీ, రమేష్‌లను అభ్యాసకులు సన్మానించారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని