logo
Published : 03/12/2021 02:38 IST

సమస్యల పరిష్కారమెలా..!

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

కరీంనగర్‌ నగరపాలక కార్యాలయం

నగరానికి గుండెకాయ లాంటి పట్టణ ప్రణాళిక ఎవరికీ పట్టకుండా మారిందన్న విమర్శలున్నాయి. ఏళ్లతరబడి ఖాళీలు భర్తీ కాకపోవడం...పనిచేస్తున్న వారితో నెట్టుకొస్తుండటంతో..ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు భరించలేక సెలవులో వెళ్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కరించే వారే లేకుండా పోతున్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమైంది. అలాంటి విభాగంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల కొరతతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంటి అనుమతుల నుంచి మొదలుకొని మాస్టర్‌ప్లాన్‌ అమలు, రోడ్లమీద ఆక్రమణల తొలగింపు, అనధికారిక కట్టడాలు, వివిధ రకాల ఫిర్యాదులు, కోర్టు కేసులు వంటివి వీరే చూడాల్సి రావడంతో పనిచేసే వారిపై భారం పెరిగింది. ఒకప్పుడు టౌన్‌ప్లానింగ్‌లో ఉద్యోగులతో కళకళలాడింది. బదిలీలు, డిప్యుటేషన్‌పై ఉన్న వారంతా వెళ్లి పోవడంతో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వారే లేకుండా పోయారు.

టీపీబీవోలు లేకుండానే కార్యకలాపాలు

నగరపాలికలో టీపీబీవోలు లేక నెలలు గడుస్తోంది. మొత్తం ఐదుగురు టీపీబీవోలు పని చేయాల్సి ఉండగా అవి పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. గతంలో ఒకరిద్దరు ఉండగా వారు వెళ్లిపోవడంతో ఏడాదిన్నర నుంచి కార్యకలాపాలన్నీ టీపీఎస్‌లే చూసుకుంటున్నారు. వీరిలో ముగ్గురు ఉండగా ఒక్కొక్కరికీ 20 డివిజన్లు కేటాయించారు. టీపీబీవో, టీపీఎస్‌లు రెండు విధులను నిర్వహిస్తుండటంతో ఏ పనులూ పూర్తిస్థాయిలో జరగడం లేదు.

తప్పని ఇబ్బందులు

పనిచేసే సిబ్బంది తక్కువ ఉండటం, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఏది చెప్పినా వెంటనే పనులు కావాలని ఒత్తిడి పెంచుతుండటంతో ఆ విభాగంలో పనిచేస్తున్న అధికారులు సెలవులు పెడుతున్నారు. టీపీవో గత రెండు నెలలుగా సెలవులో వెళ్లారు. ఏసీపీ విధులకు సక్రమంగా రాకపోవడంతో అప్పటి కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం ఏసీపీ ఒక్కరే ఉండగా ఆయన తరచుగా సెలవులు తీసుకుంటూ విధులకు హాజరవుతున్నారు. డీసీపీ సైతం అనారోగ్య సమస్యలతో అధికంగా సెలవుల్లో ఉంటున్నారు.

ఊసేలేని పోస్టుల భర్తీ

పట్టణ ప్రణాళిక విభాగంలో టీపీబీవోలు ఐదు, టీపీవో ఒకటి, ఒక ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇంజినీరింగ్‌, రెవెన్యూ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు లేరు. వీటిని భర్తీ చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అనుమతులు, ఏదైనా సమస్యలపై ఫిర్యాదు చేసే సందర్భంలో త్వరగా పరిష్కారం కావడం లేదని...ఉద్యోగులు ఏం పని చేస్తున్నారని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తుండగా అసలు కొరతను గుర్తించడం లేదు.

ఫిర్యాదులపై స్పందన ఏదీ

టీఎస్‌బీపాస్‌ వచ్చిన తర్వాత పట్టణ ప్రణాళిక అధికారాలకు కత్తెర పెట్టారు. పరిశీలించడం తప్ప నియంత్రణ విధులు లేకుండా పోయాయి. ఇంటి అనుమతులకు దరఖాస్తు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో డిప్యూటీ తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో పొందుపరిచిన దస్త్రాలు మాత్రం టౌన్‌ప్లానింగ్‌ పరిశీలించి సరిగ్గా ఉన్నట్లయితే కమిషనర్‌కు పంపిస్తారు. ఇళ్లకు సంబంధించిన ఏరకమైన ఫిర్యాదులు వచ్చినా సరే జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ(డీటీఎఫ్‌) చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తహసీల్దార్‌, పోలీసు అధికారి, ఆర్‌ఆండ్‌బీ, నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు సభ్యులుగా ఉంటారు. అక్రమ నిర్మాణాలు, సెట్‌బ్యాక్‌, ఆక్రమణలు వంటివి వీరే చూడాల్సి ఉండగా పట్టింపు లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఉద్యోగుల కొరతతో అవస్థలు పడుతున్న పట్టణ ప్రణాళికపై నెట్టి వేస్తుండటంతో పలు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని