logo
Updated : 09/12/2021 05:38 IST

కమీషన్లు ఇస్తేనే రుణ అర్హత

 మహిళా సంఘానికి రూ.5 వేలు

ఎదిరిస్తే సభ్యుల తొలగింపే

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌

నగరపాలక కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల సభ్యులు

* నగర విలీన కాలనీలోని ఓ మహిళా సంఘంలో పది మంది సభ్యులున్నారు. రుణం కోసం ఎదురు చూస్తుండగా సంఘం తరఫున రూ.5వేలు ఇస్తే వెంటనే లోన్‌ వస్తుందని సంఘం లీడర్‌ చెప్పింది. ఈ మొత్తాన్ని ఆర్పీలకు, బ్యాంకు అధికారికి, మున్సిపల్‌ ఆఫీసులో పని చేస్తున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది.

* సంఘం సభ్యులకు రుణం అవసరం కావడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరు రూ.500 చొప్పున జమ చేసి ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఎందుకు ఇవ్వాలని ఎదిరిస్తే సంఘం సభ్యురాలిని రకరకాల కొర్రీలు పెట్టి ఆర్పీ చేత తొలగిస్తారనే భయం. లేదంటే ఆ సంఘానికే రుణ అర్హత లేకుండా చేస్తారని ఓ సభ్యురాలి అవేదన.

ఇలా ఒకటెండ్రు కాదు.. నగరంలో ఉన్న దాదాపు అన్నీ మహిళా సంఘాల పరిస్థితి ఇలాగే తయారైంది. ఖర్చుల కింద ఇవ్వకపోతే సంఘం పనులు ఎవరు చూస్తారు? బ్యాంకులకు ఎవరు వెళ్తారు? మీటింగ్‌లలో సమాధానం ఎవరు చెబుతారని పేర్కొంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఫలితంగా ఇప్పుడూ మహిళా సంఘంలో ఉండాలన్న..రుణం తీసుకోవాలన్న మహిళలు ఆలోచించే పరిస్థితి వచ్చింది.
జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్‌ నగరపాలక సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వేల సంఖ్యలో మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో బోగస్‌ సంఘాలను గుర్తిస్తుండగా తాజాగా కమీషన్ల పర్వం వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వ అర్హత సాధించిన సంఘాలకు బ్యాంకు లింకేజీ, వ్యక్తిగత, శ్రీనిధి, వడ్డీలేని రుణాలు రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు మంజూరు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం కమీషన్లు ఇస్తే చాలు.. అన్ని తామై బ్యాంకు కార్యకలాపాల నుంచి మొదలు కొని ఆన్‌లైన్‌ చేసి పంపించే వరకు సిబ్బంది బాధ్యత తీసుకోవడం చూస్తే పరిస్థితి ఎంత దా‘రుణం’గా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ముప్పుతిప్పలు

సంఘాల అధ్యక్షులు సభ్యులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రశ్నించే వారి పేర్లను తొలగించి, ఇతరుల పేర్లతో సంఘం రుణం పొందుతున్నారని, ఈ విషయాన్ని లీడర్‌, ఆర్పీల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని భగత్‌నగర్‌ చెందిన ఓ సంఘం సభ్యురాలు పేర్కొంది. దీనిపై కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. రుణాల కోసం దరఖాస్తు చేస్తే తిప్పుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్నారు.

కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తాం - రాజేశ్వర్‌, సహాయ కమిషనర్‌, నగరపాలిక

ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటివి జరగకుండా ఆదేశాలిస్తాం. మెప్మాపై వస్తున్న అన్ని రకాల ఫిర్యాదులను కమిషనర్‌ వచ్చిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్తాం.

రుణాన్ని బట్టి..

సంఘాలకు మంజూరవుతున్న రుణాన్ని బట్టీ కమీషన్‌ ఇవ్వాల్సిందే. రూ.లక్ష అయితే రూ.5వేలు, రూ.2లక్షలు అయితే రూ.10వేలు చొప్పున అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ తంతు, ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. వసూలు చేస్తున్న మొత్తంలో ఎవరికి ఎంత ఇస్తారనే విషయం లీడర్లు సభ్యులకు వివరిస్తున్నారు.  కార్యాలయాల్లో పని చేసే వారికి కూడా జీతాలు రావని, వారందరికీ ఖర్చుల కింద మనమే ఇస్తే మన పనులు సాఫీగా సాగుతాయని చెప్పడం విడ్డూరంగా ఉంది.

పట్టణ జనాభా   : 4,12,472
మొత్తం స్వశక్తి సంఘాలు : 6676
మహిళా సంఘాల్లోని సభ్యులు : 66,910
పట్టణ సమాఖ్యలు     : 6
స్లమ్‌ సమాఖ్యలు       : 231

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని