logo
Published : 09/12/2021 05:24 IST

దూరం మరచి.. గదుల్లో కిక్కిరిసి..

 ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నిబంధనల అమలు శూన్యం

న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం

ఎలగందల్‌ ప్రభుత్వ పాఠశాలలో బెంచీకి నలుగురు విద్యార్థులు

జిల్లాలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుండగా మరో వైపు కొత్త వేరియంట్ల సమాచారం కలవరపెడుతోంది. రక్షణ చర్యలు చేపడితే సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక దూరం కరవైంది. బాలలు మాస్క్‌లు ధరిస్తున్నా గదుల కొరత ఇబ్బంది పెడుతోంది. జిల్లాలోని 651 ప్రభుత్వ పాఠశాలలుండగా, వాటిల్లో 43,700 మంది చదువుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతంలో కంటే 10వేల మందికి కొత్తగా చేరారు. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన సాగుతుండగా విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. మెజారిటీ పాఠశాలల్లో ఏళ్లకు ఏళ్లుగా మరమ్మతులు కరవై ఉన్న తరగతి గదులు శిథిలావస్థలోకి చేరాయి. కొత్తగా 722 తరగతి గదుల నిర్మాణం అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నేటికి మంజూరు కాలేదు.

పక్క పక్కనే

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఒక్కో గదిలో 30 నుంచి 60 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. బాలల ప్రవేశాలు పెరిగిన ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని చోట్ల వరండాలోని స్థలం కూడా సరిపోవడం లేదు. మధ్యాహ్న భోజనం వడ్డించడం, బాలలు తినే ప్రదేశాల్లో కూడా భౌతిక దూరం కరవైంది. గదులు, ఆవరణలు, మూత్రశాలల శానిటైజేషన్‌ చేయడం మానేశారు. విశాలమైన ప్రైవేటు వైద్య కళాశాలలో 50 మంది విద్యార్థులు కరోనాకు గురవగా, తరగతి గదుల్లో ఇరుకుఇరుకుగా కూర్చుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం విద్యార్థులను సురక్షితంగా నిలిపే చర్యలను చేపట్టాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.

* కరీంనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో ఒక బేంచిపై ముగ్గురు విద్యార్థులను కూర్చుండబెడుతున్నారని, వైరస్‌ వ్యాపిస్తే బాధ్యులెవరని ఓ తండ్రి ఉపాధ్యాయులను నిలదీశారు. గదులు లేవు ఉన్న బెంచీలపైనే సర్దుతున్నాం. దూరంగా ఎలా కూర్చోబెట్టాలో చూపించండి అంటూ ఉపాధ్యాయులు తమ బాధను వెళ్లగక్కారు.

* కరీంనగర్‌ సుభాష్‌నగర్‌లోని ఓ తరగతి గదిలో 40 నుంచి 60 మంది విద్యార్థులు కూర్చుంటున్నారు. భౌతిక దూరం పాటించేలా వారిని కూర్చోబెట్టేందుకు అవసరమైన గదులు లేని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.

కరీంనగర్‌ సుభాష్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థులు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల పరిస్థితి

మరమ్మతులు చేయాల్సినవి : 738
మైనర్‌ రిపేర్లు : 1043
శిథిల భవనాలు : 575
కొత్తగా నిర్మించాల్సినవి : 722

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని