logo
Published : 09/12/2021 05:24 IST

రక్తహీనతపై సమరం

జిల్లా వ్యాప్తంగా సర్వే

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే

మానకొండూర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు

మహిళల్లో రక్తహీనతను తగ్గించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా పాలనాధికారి సూచనల మేరకు రక్త హీనతపై సమరం నిర్వహించాలని నిర్ణయించారు. రక్త హీనతతో బాధపడుతున్నవారికి తగిన మందులు ఇచ్చి వారికి అవసరమైన చికిత్స ప్రభుత్వపరంగా అందించనున్నారు. రెండేళ్ల క్రితం వరకు ‘అనీమియా ముక్త్‌ భారత్‌’ పథకం ద్వారా రాష్ట్రీయ బాల సురక్ష విభాగం రక్తహీనత బాలికలకు మందుల పంపిణీ చేపట్టింది. ఇది చదువుకునే విద్యార్థులకే పరిమితమైంది. అలా కాకుండా మహిళలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.

శిక్షణ..

జిల్లాలోని 14 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయినులు, ఎ.ఎన్‌.ఎం.లు సర్వే చేస్తున్నారు.  ఈ నెల 3న ప్రారంభమైన  సర్వే డిసెంబరు 21 కల్లా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. సర్వేలో పాల్గొనే ఎ.ఎన్‌.ఎం.లకు రెండ్రోజుల శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్సీ పోలింగ్‌ తర్వాత జిల్లాలోని అన్ని గ్రామాలలో వివరాలు సేకరిస్తారు.

పరీక్షలు...

యుక్త వయస్సు పిల్లల్లో సాధారణంగా హిమోగ్లోబిన్‌ 10.5 మిల్లీ గ్రాముల నుంచి 11.5 వరకు ఉండాలి, 8 కంటె తక్కువ ఉన్నవారిని పరీక్షల ద్వారా గుర్తిస్తారు. ఐరన్‌ మాత్రలు ఇతర మందులు సరఫరా చేస్తారు. వీరిని మూడు నెలల పాటు పర్యవేక్షిస్తారు. రక్తహీనత తగ్గి మెరుగు పడితే మున్ముందు సమస్య రాకుండా సూచనలు చేస్తారు. మూడు నెలల వరకు రక్తహీనతలో మార్పు రాకపోతే వారిని గుర్తించి ప్రత్యేక వైద్యం అందించేందుకు ప్రభుత్వ అసుపత్రులకు పంపిస్తారు. ఈ కార్యక్రమం అంతా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో కొనసాగుతుంది.

జిల్లాలో ప్రత్యేకం

అనీమియా ముక్త్‌ భారత్‌ కార్యక్రమం పాఠశాల, కళాశాల విద్యార్థినులకు అమలు చేస్తున్నారు. జిల్లాలోని మహిళల్లో రక్తహీనత లేకుండా అన్ని చర్యలు చేపట్టే విషయంలో జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని