logo

మిగిలింది ఒక్క రోజే

కరీంనగర్‌ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు గడువు మాత్రమే మిగిలింది. మంగళవారం రాత్రి ప్రచార పర్వం ముగిసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అత్యధిక మంది ఓటర్లుగా

Published : 09 Dec 2021 05:24 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించిన ప్రధాన ఎన్నికల అధికారి

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు గడువు మాత్రమే మిగిలింది. మంగళవారం రాత్రి ప్రచార పర్వం ముగిసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అత్యధిక మంది ఓటర్లుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయ శిబిరాలలో ఉన్నారు. బెంగుళూర్‌, గోవా, తిరుపతి ప్రాంతాలకు వెళ్లిన వారంతా బుధవారం రాత్రికల్లా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలలో శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. శిబిరాలలో వెళ్లకుండా స్థానికంగా ఉన్న విపక్ష, స్వతంత్ర ఓటర్లు మాత్రం జిల్లాలోనే ఉన్నారు. వీరంతా శుక్రవారం ముందుగా ఓటు వినియోగించుకునే అవకాశముంది. అధికార పక్షానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులైన ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి మధ్యాహ్నం కల్లా చేరుకొని ఓటు వినియోగించుకుంటారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు తెరాస అభ్యర్థులతో పాటు మొత్తం 10మంది ఎన్నికల బరిలో ఉన్నారు. విజయం సాధించేందుకు వీలుగా ఇద్దరికీ ఓటు ఎలా వినియోగించాలని అనే విషయంపై గురువారం తెరాస ముఖ్య  నేతలు, మంత్రులు, ఎన్నికలలో అనుభవం ఉన్న వారి ద్వారా సూచనలు చేయించనున్నట్లు తెలిసింది. ఒక్క ఓటు కూడా దెబ్బతినకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

సౌకర్యాలు కల్పించాలి..

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయెల్‌ బుధవారం జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌తో సమీక్షించారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు రోజులో అన్ని సౌకర్యాలు కల్పించాలని, పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని