logo

సుందరీకరణ పనులపై నీలినీడలు

కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల పురపాలికల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా 2018లో ఒక్కో పురపాలికకు రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా పురపాలికల్లో వివిధ పనులు చేపట్టారు. పనులు త్వరితగతిన జరిగేందుకు

Published : 09 Dec 2021 05:24 IST

ప్రారంభం కాకుండానే నిలిపివేయాలని ఆదేశాలు

కోరుట్లలో ప్రారంభం కాని గ్రీన్‌ఐలాండ్‌ పనులు

కోరుట్లగ్రామీణం, న్యూస్‌టుడే

కోరుట్ల పురపాలికలో ప్రారంభం కాని పనులు

కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల పురపాలికల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా 2018లో ఒక్కో పురపాలికకు రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా పురపాలికల్లో వివిధ పనులు చేపట్టారు. పనులు త్వరితగతిన జరిగేందుకు ఆర్‌ఆండ్‌బీకి పనులను అప్పగించింది. రూ.25 కోట్లతో మొదటి విడత, రెండో విడతలో రూ.25 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు చేపట్టారు. కోరుట్ల పురపాలికలో రూ.25 కోట్లతో మొదటి విడతలో భాగంగా 15 పనులను గుర్తించారు. ఇందులో 11 పనులు పూర్తికాగా మరో నాలుగు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రెండోవిడత 9 పనులను గుర్తించగా ఏడు పనులు వివిధ దశలో ఉండగా రెండు పనులు ప్రారంభించలేదు. టీయూఎఫ్‌డీసీ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడిచిపోతున్న ఇంకా కొన్ని పనులు ప్రారంభించలేదు. ప్రారంభించని పనులు నిలిపివేయాలని వాటిని మొదలు పెట్టవద్దని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ప్రారంభం కానీ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

* మొదటి విడతలో రూ.కోటితో నందిచౌరస్తా, బస్టాండ్‌, ఐబీ అతిథి గృహం వద్ద జంక్షన్‌ల వద్ద గ్రీన్‌ ఐలాండ్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సిగ్నల్‌తో పాటు, హైమాస్ట్‌ దీపాల ఏర్పాటు పనులు

* కోరుట్ల పట్టణంలోని అంతర్గత రహదారులైన పాత  మున్సిపల్‌ నుంచి ఝాన్సీరోడ్‌ వరకూ కిలో మీటరుకు గానూ రూ.1.20 కోట్లతో ఆధునిక వీధిదీపాల ఏర్పాటు

* అంతర్గత రహదారి కార్గిల్‌ చౌరస్తా నుంచి వెంకటేశ్వర గుడి వరకూ 0.6 కిలోమీటరు, ఐబీరోడ్‌ నుంచి గడిబురుజు వరకూ 0.8 కిలోమీటరు ఆధునిక వీధిదీపాల ఏర్పాటుకు రూ.1.50 కోట్ల నిధులు

* మద్దుల చెరువు మినీ ట్యాంకు బండు వద్ద జాగింగ్‌ ట్రాక్‌, ఫుట్‌పాత్‌, ఇరువైపుల రేయిలింగ్‌, కూర్చునేందుకు బెంచీలు, గ్రీనరీ ఏర్పాటు పనులకు రూ.2.35 కోట్ల నిధుల కేటాయింపు

* కోరుట్ల వాగు వద్ద బతుకమ్మ ఘాట్‌, పాత్‌వేస్‌, టాయిలెట్‌బ్లాక్‌కు రూ.35 లక్షలు

* మద్దుల చెరువులోకి మురుగు కాలువ నీరు చేరకుండా ప్రధాన మురుగు కాలువ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులతో టెండర్లు పూర్తయిన గుత్తేదారు పనులు చేయడంలో జాప్యంతో నిలిచిపోయాయి.

ప్రారంభ దశలో గ్రంథాలయ భవన నిర్మాణ పనులు

ఉన్నతాధికారులకు నివేదించాం కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే

టెండర్ల జాప్యంతో పాటు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రారంభం కాని పనులు చేపట్టేలా ఉన్నతాధికారులకు నివేదించాం. తొందరలోనే అనుమతి వస్తుందని పనులు ప్రారంభానికి చొరవ చూపుతాం.

రెండో విడత పనులు

* గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.50 లక్షలతో టెండర్లు పూర్తయిన పిల్లర్లకు గోతులు తీసి వదిలేశారు.

* వెంకటేశ్వర గుడి వద్ద మినీ మాస్‌లైట్‌, ఫౌంటేన్‌ ఏర్పాటుకు రూ.10లక్షలు కోరుట్ల పురపాలికల్లో రూ.9 కోట్ల పనులు ప్రారంభం కాకపోగా, మెట్‌పల్లి పురపాలికలో దాదాపుగా రూ.5 కోట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకూ పనులు ప్రారంభించవద్దని బల్ధియాలకు పురపాలకశాఖ ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు