logo

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు ఎస్పీ చెన్నూరి రూపేష్‌ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published : 09 Dec 2021 05:24 IST

మాట్లాడుతున్న అదనపు ఎస్పీ రూపేష్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు ఎస్పీ చెన్నూరి రూపేష్‌ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని నేరాలపై నిఘా పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని పోలీసుస్టేషన్లకు వచ్చే వివిధ రకాల ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణ నివేదికను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన విచారణ పూర్తిచేసి న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేయాలని ట్రయల్‌ సమయంలో సాక్షులను ప్రవేశపెట్టి నిందితులకు శిక్షలు పడేవిధంగా చూడాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించాలని పనిచేయని వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. అన్ని పోలీసుస్టేషన్లలో వర్టికల్‌ అమలు చేయాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు ఆర్‌.ప్రకాష్‌, రాఘవేంద్రరావు, ఇన్స్‌పెక్టర్లు రాజశేఖరరాజు, కిషోర్‌, క్రిష్ణకుమార్‌, రమణమూర్తి, కోటేశ్వర్‌, సరిలాల్‌ ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని