logo
Published : 09/12/2021 05:24 IST

కలెక్టరేట్‌ ఎదుట వైద్య సిబ్బంది ధర్నా

నలుగురికి అస్వస్థత

కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న వైద్య సిబ్బంది

జగిత్యాల, న్యూస్‌టుడే : పనివేళలు కుదించడంతో పాటు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బుధవారం జగిత్యాల కలెక్టరేట్‌ ముందు వైద్యశాఖలో పనిచేస్తున్న ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సమానపనికి సమాన వేతనం, రవాణా సౌకర్యం, భోజన వసతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే విధులు తమకు కేటాయించాలని కోరారు. గత మూడేళ్లుగా కరోనా నివారణకు కృషి చేస్తున్న తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న తరుణంలో నలుగురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వైద్య సిబ్బంది ఆందోళనతో జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై రాకపోకలు అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలానికి జిల్లా ఉపవైద్యాధికారి జైపాల్‌రెడ్డి చేరుకుని సిబ్బందితో మాట్లాడి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

అస్వస్థతకు గురైన ఉద్యోగిని

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని