logo

మంటల్లో కాలి రైతు మృతి

వరి కోసిన తర్వాత ఉండే గడ్డిని (కొయ్యకాళ్లను) కాల్చే క్రమంలో ఓ రైతు అవే మంటలంటుకుని మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం వెల్దురిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల

Published : 09 Dec 2021 05:24 IST

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : వరి కోసిన తర్వాత ఉండే గడ్డిని (కొయ్యకాళ్లను) కాల్చే క్రమంలో ఓ రైతు అవే మంటలంటుకుని మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం వెల్దురిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్‌గౌడ్‌ (65) అనే రైతు తన పొలాన్ని ఈ మధ్యనే కోత కోశారు. రబీలో సాగు చేసేందుకు కొయ్యకాళ్లు కాల్చాలని మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. కాల్చే సమయంలో పొగ వ్యాపించి అస్వస్థతకు గురై పొలంలోనే పడిపోయాడు. మంటలు వ్యాపించి శరీరం కొంతభాగం కాలిపోయి మృతి చెందాడు. లక్ష్మణ్‌గౌడ్‌ రాత్రి వరకు ఇంటికి రాకపోగా బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూసే సరికి విగతజీవిగా పడి ఉన్నాడు. పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని