logo

జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దశలో జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు ఒమిక్రాన్‌ బారిన పడ్డాడు. ఓసీపీ-2లో

Published : 15 Jan 2022 03:38 IST

సెంటినరీకాలనీ, న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దశలో జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు ఒమిక్రాన్‌ బారిన పడ్డాడు. ఓసీపీ-2లో ఈపీ ఫిట్టర్‌ కమ్‌ మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తున్న సదరు కార్మికుడు అమెరికాలో ఉన్న కుమారుల వద్దకు వెళ్లి ఇటీవలే కాలనీకి వచ్చారు. స్వల్పంగా జ్వరం, జలుబు, దగ్గు ఉండటంతో ఈ నెల 3న స్థానిక సింగరేణి డిస్పెన్సరీలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి గోదావరిఖనిలోని సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 4న అతడి నమూనాలను జన్యు క్రమ విశ్లేషణకు పంపించగా, శుక్రవారం ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. 11 రోజలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని