logo

ముగ్గులతో సీఎంకు ఉపాధ్యాయినుల వినతి

కొత్త కరీంనగర్‌ జిల్లాకు స్పౌజ్‌ కేటగిరీ కింద ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ కరీంనగర్‌ జిల్లా స్పౌస్‌ ఇన్‌కమింగ్‌ గ్రూపు ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు ఉపాధ్యాయినులు

Published : 15 Jan 2022 04:07 IST

ముగ్గుతో సీఎం కేసీఆర్‌కు వినతిచేసిన ఉపాధ్యాయురాలు

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: కొత్త కరీంనగర్‌ జిల్లాకు స్పౌజ్‌ కేటగిరీ కింద ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ కరీంనగర్‌ జిల్లా స్పౌస్‌ ఇన్‌కమింగ్‌ గ్రూపు ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు ఉపాధ్యాయినులు ముగ్గులు వేసి అందులో సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. భార్య, భర్తలు, వారి కుటుంబాలు వేర్వేరు జిల్లాలో ఉద్యోగాలు చేస్తూ పడుతున్న ఇబ్బందులను రాశారు. స్పౌజ్‌ కేటగిరీకి అవకాశమిస్తే పలు చోట్ల ఉపాధ్యాయుల ఖాళీలు ఏర్పడి టీఆర్టీ ద్వారా నింపే అవకాశముందని వివరించారు. 13 జిల్లాల్లో బ్లాక్‌ లిస్టును ఎత్తివేసి వాటిల్లో స్పౌజ్‌ కేటగిరీ కింద నియామకాలకు అనుమతించి తమ మనోవేదనను తీర్చాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని