logo

దొంగ నోట్ల తయారీ ముఠా అరెస్టు

సుల్తానాబాద్‌ ప్రాంతంలో కొన్ని రోజులుగా నకిలీ నోట్లు తయారీ, చలామణి చేస్తున్న ముఠా సభ్యులను సుల్తానాబాద్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.77,400 నకిలీ నోట్లు, రూ.4 లక్షల విలువైన నోట్ల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దపల్లిలోని తన కార్యాలయంలో

Published : 15 Jan 2022 04:07 IST

రూ.77,400 నకిలీ కరెన్సీ, తయారీ సామగ్రి స్వాధీనం

 
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ సారంగపాణి, స్వాధీనం చేసుకున్న దొంగ నోట్లు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: సుల్తానాబాద్‌ ప్రాంతంలో కొన్ని రోజులుగా నకిలీ నోట్లు తయారీ, చలామణి చేస్తున్న ముఠా సభ్యులను సుల్తానాబాద్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.77,400 నకిలీ నోట్లు, రూ.4 లక్షల విలువైన నోట్ల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దపల్లిలోని తన కార్యాలయంలో ఏసీపీ సారంగపాణి విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో నాలుగు నెలల కిందట నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానిత ప్రాంతాలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో సుల్తానాబాద్‌ చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను తనిఖీ చేయగా నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. వారిని విచారించిన పోలీసులు శ్రీరాంపూర్‌కు చెందిన చల్ల రాయమల్లు, దారంగుల వెంకటి, పెండం నరేష్‌, బసంత్‌నగర్‌లోని జీడీనగర్‌కు చెందిన కొమిరే రాజు, శ్రీరాంపూర్‌ మండలం చిన్నరాతుపల్లికి చెందిన దుగ్యాల అనిల్‌లను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. వారి నుంచి ముద్రణ సామగ్రితో పాటు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా నిందితులకు గతంలో నేర చరిత్ర ఉందన్నారు. కార్యక్రమంలో సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రకరణ్‌రెడ్డి, ఎస్సై ఉపేందర్‌రావు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని