logo

సెలవుల పొడిగింపు సరికాదు

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నెపంతో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించడం సరికాదని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దోర్నాల భూపాల్‌రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ఆయన

Published : 17 Jan 2022 02:47 IST

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం కరోనా నెపంతో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించడం సరికాదని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దోర్నాల భూపాల్‌రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ఆయన ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారని తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి తరగతులు ప్రారంభమవగా ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో మళ్లీ సెలవులను పొడిగించడం సరికాదన్నారు. ఒమిక్రాన్‌ తీవ్రత ప్రాణహని కలిగించేది కాదని తెలిపారు. మార్కెట్లు, సినిమా హాళ్లు, వేడుకలు, బార్లు, సమావేశాలు, సంబరాలకు లేని కరోనా విద్యా సంస్థల వల్ల వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారని తెలిపారు. కనీసం 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన కొనసాగిస్తే బాగుంటుందని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జునేని వేణుగోపాల్‌రావు, మల్లారపు పురుషోత్తం, రాంబాబు, నసీరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని