logo

అందమైన బాల్యం.. రక్షించడమే ధ్యేయం

బాలకార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్న చిన్నారులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌(ఐసీపీఎస్‌) అధికారులు. అందమైన బాల్యాన్ని కష్టాలబాట పట్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Published : 17 Jan 2022 02:47 IST

ఆపరేషన్‌ స్మైల్‌తో పనిలో నుంచి బాలలకు విముక్తి
సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే

బడిబయట బాలలను గుర్తిస్తున్న అధికారులు

బాలకార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్న చిన్నారులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌(ఐసీపీఎస్‌) అధికారులు. అందమైన బాల్యాన్ని కష్టాలబాట పట్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. బాలకార్మికులుగా మారిన చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు.

బాలలు, అనాథ పిల్లలు, బాలకార్మికులను గుర్తించేందుకు ప్రభుత్వం 2015లో ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా బడి బయట బాలలను గుర్తిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీన కార్యక్రమం ప్రారంభమవగా ఐసీపీఎస్‌ అధికారులు, పోలీస్‌శాఖ ఇతర శాఖల సమన్వయంతో ఇప్పటివరకు 14 మంది (వేములవాడ 9, సిరిసిల్ల 5) బాలకార్మికులను గుర్తించారు. ఇసుక బట్టీలు, హోటళ్లు, మెకానిక్‌ దుకాణాల్లో వీరిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు, ఇతరుల స్వార్థానికి కొందరు బాలలు కూలీలుగా మారుతున్నారు. కొందరు ట్రాఫికింగ్‌ బాధితులుగా మారుతున్నారు. ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా జిల్లాలో 2017లో 65 మంది, 2018లో 50, 2019లో 31, 2020లో 40, 2021లో 255 మందిని విముక్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా బాలకార్మికుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. మిస్సింగ్‌, పారిపోయిన చిన్నారులు, బలకార్మికులు, వీధి బాలలు, ఛైల్డ్‌ ట్రాఫికింగ్‌కి గురైన బాలలు, హింసకు గురైన చిన్నారులను విముక్తి చేస్తున్నారు. 0 నుంచి 14 సంవత్సరాలలోపు బాలలు ఏ పనిలో ఉన్నా పనిచేయించుకునేవారు శిక్షార్హులని తెలిపారు. 14 నుంచి 18 మధ్య బాలలు ఇటుక బట్టీలు, టపాసుల తయారీలాంటి భయంకరమైన పనిలో ఉంటే బాధ్యులు శిక్షార్హులు. రైస్‌మిల్‌, ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, చిన్న పరిశ్రమలు, కాటన్‌ మిల్లు, హోటళ్లు, వెల్డిండ్‌ దుకాణాలు, రెస్టారెంట్లు, దాబాలు, కనస్ట్రక్షన్‌ సైటÆ్లు, టైర్‌ దుకాణాలు, స్వీట్‌ దుకాణాలు, షాపింగ్‌ మాల్‌, బస్‌స్టేషన్లు, ట్రాఫిక్‌ జంక్షన్‌, ఫుట్‌పాత్‌, మెకానిక్‌ దుకాణాలు, భిక్షాటన చేసే ప్రాంతాల్లో బాలలను గుర్తించి విముక్తి చేస్తున్నారు. ముందుగా బాలలను గుర్తిస్తారు. ఆ తర్వాత బాధ్యులను మందలిస్తారు. అవసరమైతే ఛైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తారు. బాధిత బాలలకు పరిహారం, లాభాలను చేకూరేలా చూస్తారు. తల్లిదండ్రులకు, బాలలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. దగ్గరలో ఉన్న పాఠశాలలను చేర్పిస్తారు.

ఒకేచోట ఎక్కువ
ఉంటే వారందరినీ విముక్తి చేసి అక్కడే వర్క్‌సైటÆ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తారు. వారికి మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకుంటారు. చిన్నారుల వివరాలను ్మ(‘్ప‌్ర.‘్ణ్ణ.్ణ్న‌్ర.i- వెబ్‌పోర్టల్‌లో నమోదుచేసి వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. సీడబ్ల్సూసీ కమిటీ ముందు హాజరుపరుస్తారు. అనాథలు, ఎవరూ లేనివారు హింసకు గురైతే సిరిసిల్లలోని రంగినేని ట్రస్టులో ఏర్పాటు చేసిన ఛైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీసీఐ)లో చేర్పిస్తారు.


పాఠశాలల్లో నమోదు చేస్తున్నాం
-అంజయ్య, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌

ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా బడిబయటి బాలలను గుర్తిస్తున్నాం. పాఠశాలల్లో నమోదు చేస్తున్నాం. ఎక్కువగా ఇటుక బట్టీలలో బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఇతర రాష్ట్రాల బాలల కూలీలుగా పనిచేస్తున్నారు. బాలల అందమైన బాల్యాన్ని సంరక్షిచడమే ఆపరేషన్‌ స్మైల్‌ లక్ష్యం. వేములవాడలో చాలావరకు భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి బడిలో చేర్పించాం. కొవిడ్‌ కారణంగా అనాథలు, సెమీ ఆర్ఫన్లు డ్రాపౌట్లుగా ఉన్నట్లు గుర్తించాం. తగు చర్యలు చేపడుతున్నాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాం.


సద్వినియోగం చేసుకోవాలి
-లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమశాఖ అధికారి

బాలలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎవరైనా తమ ప్రాంతంలో బాలకార్మికులను గుర్తించినా ఛైల్డ్‌ లైన్‌-1098ను సద్వినియోగం చేసుకోవాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంరక్షణ అందరి బాధ్యత. తప్పిపోయిన పిల్లలను వారి స్వస్థాలకు పంపించడం, అనాథలు, భిక్షాటన చేస్తున్నవారిని, నిర్లక్ష్యానికి గురైన బాలలను గుర్తించి వారికి ఆదరణ కల్పించడం, సంరక్షించడమే ఆపరేషన్‌ స్మైల్‌ లక్ష్యం. బడి బయటి బాలలను గుర్తించి సీడబ్లూసీ ముందు ప్రవేశపెట్టి సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని