logo

బారికేడ్లు ఇలా.. ట్రాఫిక్‌ నియంత్రణ ఎలా..!

జమ్మికుంట పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు ఉపయోగించాల్సిన బారికేడ్లు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నిరుపయోగంగా ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని రహదారులన్నీ నిత్యం వాహనదారుల

Published : 17 Jan 2022 02:47 IST


కళాశాల మైదానంలో వృథాగా బారికేడ్లు

జమ్మికుంట పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు ఉపయోగించాల్సిన బారికేడ్లు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నిరుపయోగంగా ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని రహదారులన్నీ నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి బారికేడ్లను పోలీసుశాఖకు అప్పగించారు. దసరా పండుగ సమయంలో సుమారు 12 బారికేడ్లను ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పోలీసులు ఉపయోగించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో వృథాగా వదిలేశారు. దీంతో మైదానంలో ఆటలు ఆడేందుకు వచ్చిన పలువురు వాటిని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటి నిర్వహణ సక్రమంగా చేపట్టాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, జమ్మికుంట గ్రామీణం

శిశుమందిర్‌ సమీపంలో మురుగు కాలువ పక్కన ఇలా...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని