logo

వైభవంగా సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇళ్ల ముందు రంగవల్లులు వేశారు. కొత్తపల్లి పురపాలక సంఘంలోని 6వ వార్డులో  ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటిన

Published : 17 Jan 2022 02:47 IST

మారుతినగర్‌లోని ఓ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళలు

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇళ్ల ముందు రంగవల్లులు వేశారు. కొత్తపల్లి పురపాలక సంఘంలోని 6వ వార్డులో  ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటిన మహిళలకు బహుమతులు అందించారు. కరోనా కష్టకాలంలో పనులు సక్రమంగా నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.  మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌లు గున్నాల విజయ, వాసాల రమేష్‌, కవిత, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపల్లి పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు హాజరై ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సమితి జిల్లా ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పి.రాజు, బాధ్యులు కె.రాజు తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, న్యూస్‌టుడే: జమ్మికుంటలో సంక్రాంతి, కనుమ వేడుకలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. శనివారం సంక్రాంతి సందర్బంగా ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దారు. మహిళలు పంచవటి నోము నోచారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక అర్చనలు చేశారు.

జ్యోతినగర్‌లోని ఓ వీధిలో..

హుజూరాబాద్‌ పట్టణం: హుజూరాబాద్‌లో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని హనుమాన్‌ ఆలయం నుంచి కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి జాతరకు వెళ్లే బండ్లు తిరుగు వేడుకలను శివాజీ నగర్‌ కాలనీకి చెందిన ఆరె క్షత్రియులు ప్రారంభించారు.  ప్రతాపవాడకు చెందిన రథాన్ని అందంగా అలంకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ ఛైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, ఆలయ కమిటీ ఛైర్మన్‌ భూసారపు బాపురావు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
చొప్పదండి: మండలంలో సంక్రాంతి పర్వదినం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని శ్రీవెంకటేశ్వర-మణికంఠ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుమ్లాపూర్‌, దేశాయిపేట గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.

జమ్మికుంటలో సామూహిక పంచవటి నోమునిర్వహిస్తున్న మహిళలు

విజేతలకు బహుమతులు అందజేత
గంగాధర: గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో సంకాంత్రి పండుగ సందర్భంగా 4వ వార్డు సభ్యుడు, జయపాల్‌రెడ్డి మిత్రమండలి సభ్యుడు లంక హరిబాబు ఆధ్వర్యంలో మహిళలు, యువతులకు ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు సర్పంచి సాగి రమ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. బాలగౌడ్‌, ఆంజనేయులు, మురళి, సత్యం, మునీందర్‌, మహేష్‌ పాల్గొన్నారు.
రామడుగు: మండల కేంద్రంలో యూత్‌ క్లబ్‌ ఆధ్వరంలో సంక్రాంతి పండగను పురస్కరించుకుని క్రికెట్‌ పోటీలు మొదలుపెట్టారు. గోపాల్‌రావుపేటలో గ్రేస్‌బాల్‌ క్రికెట్‌ పోటీలను సర్పంచి కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీ సభ్యుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. దేశరాజ్‌పల్లి ఐక్యత క్రికెట్‌ యూత్‌ సభ్యుల ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్‌రెడ్డి క్రీడా దుస్తులు అందజేశారు.
రామడుగు: సంక్రాంతి పర్వదినాన తమ పాడి పశువులకు కాట్రేవుల పండగను రామడుగు మండలం వెలిచాలలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పశువులకు తిలకం దిద్ది, రంగులతో అలంకరించి వేదిక వద్దకు తీసుకువచ్చారు. సర్పంచి వీర్ల సరోజన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం గ్రామ పశువులకాపరి చేరుకున్నాడు. రైతులు పశువుల కాపరిని తరుముతూ పశువుల చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేశారు.

కాట్రేవుల పండగలో పూజలు చేస్తున్న సర్పంచి

మార్కెట్‌ రోడ్డులోని వేంకటేశ్వరాలయంలో భక్తుల రద్దీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని