logo

నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యం

రాష్ట్రంలో కరీంనగర్‌ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం బి.ఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో రూ.2.80 కోట్లతో

Published : 17 Jan 2022 02:47 IST

ఇండోర్‌ స్టేడియం, స్కేటింగ్‌ రింక్‌ను ప్రారంభించిన మంత్రి గంగుల

స్కేటింగ్‌ క్రీడాకారులతో మంత్రి కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, అతిథులు

కరీంనగర్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కరీంనగర్‌ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం బి.ఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో రూ.2.80 కోట్లతో ఆధునికీకరించిన ఇండోర్‌ స్టేడియం, స్కేటింగ్‌ రింక్‌, బాస్కెట్‌ కోర్టును రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం రాంనగర్‌లోని యువజన సమాచార కేంద్రంలో నిర్మించిన నిరుద్యోగ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కరీంనగర్‌ పట్టణంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. క్రీడలు భావితరానికి బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో కరీంనగర్‌ స్టేడియంలో రూ.8కోట్లతో షాపింగ్‌ కాంప్లెక్స్‌, రూ.1.5కోట్లతో ఇండోర్‌ స్టేడియం ఆధునికీకరణ, రూ.30లక్షలతో స్కేటింగ్‌, రూ.30లక్షలతో బాస్కెట్‌బాల్‌ కోర్టు, రూ.21 కోట్లతో స్లేడియం ప్రాంగణం అభివృద్ధి పనులు చేపటినట్లు పేర్కొన్నారు. రూ.48లక్షలతో  వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం భవనాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం పెట్టుబడుల్లో తెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో  మేయర్‌ సునీల్‌రావు, సుడా ఛైర్మన్‌ రామకృష్ణరావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూప రాణి, జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఇస్లావత్‌, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.మహిపాల్‌, ఉపాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు కడారి రవి, లక్ష్మణ్‌, సంపత్‌రావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని