logo

ముంపు ముప్పు తప్పేలా!

వర్షం పడితే చాలు.. నగర వీధులు జలమయమవుతున్నాయి. గతంలో నిర్మించిన డ్రైనేజీల సామర్థ్యం అంతంతా మాత్రంగానే ఉండగా.. పెరుగుతున్న నగర విస్తీర్ణంతో ముంపు సమస్య తీవ్రమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కాల్వల గుండానే వస్తుండటంతో ఆ కాల్వలు నిండి రోడ్ల మీదికి ప్రవహిస్తుండటం, లోతట్టు ప్రాంతాలు నీట మునగడం సాధారణంగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఇలాగే ఉన్నా పరిష్కరించడం లేదనే నగరవాసుల విమర్శలను కట్టి పెట్టేలా స్మార్ట్‌సిటీలో శాశ్వత పరిష్కారం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

Published : 17 Jan 2022 02:47 IST

వరదనీటి మళ్లింపునకు శాశ్వత పరిష్కారం
రూ.132.98 కోట్లతో ప్రధాన నాలాల విస్తరణ
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న జ్యోతినగర్‌ ప్రాంతం

వర్షం పడితే చాలు.. నగర వీధులు జలమయమవుతున్నాయి. గతంలో నిర్మించిన డ్రైనేజీల సామర్థ్యం అంతంతా మాత్రంగానే ఉండగా.. పెరుగుతున్న నగర విస్తీర్ణంతో ముంపు సమస్య తీవ్రమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కాల్వల గుండానే వస్తుండటంతో ఆ కాల్వలు నిండి రోడ్ల మీదికి ప్రవహిస్తుండటం, లోతట్టు ప్రాంతాలు నీట మునగడం సాధారణంగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఇలాగే ఉన్నా పరిష్కరించడం లేదనే నగరవాసుల విమర్శలను కట్టి పెట్టేలా స్మార్ట్‌సిటీలో శాశ్వత పరిష్కారం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానమైన నాలాల విస్తరణ, అభివృద్ధికి ముందడుగు పడింది. ఇటీవల జరిగిన స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశంలో రూ.132.98 కోట్లతో వరదకాల్వలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలోంచుకొని వీటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే ఏ ప్రాంతం నీట మునుగుతోంది. ఎక్కడ ఎంతమేర వరదనీరు వస్తుంది? నగర వ్యాప్తంగా వరద, మురుగునీరు పంపించేలా సర్వే నిర్వహించిన స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ బృందం ఆ మేరకు డీపీఆర్‌లు తయారు చేసి టెండర్లు నిర్వహించేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు.

వరదకాల్వలు సక్రమంగా లేక రోడ్డుపై నిలుస్తున్న నీరు

736 కిలోమీటర్లు
నగరంలో వరదకాల్వల నిర్మాణానికి ఐదు జోన్లుగా ఖరారు చేశారు. ఇందులో మొత్తం 736.3 కిలోమీటర్ల పొడవునా నాలాలు నిర్మించనున్నారు. వీటిని ప్రధాన, అంతర్గత కాల్వలుగా గుర్తించగా ప్రైమరీ, సెకండరీగా ప్రాధాన్యం ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలు కూడా గుర్తించారు. జ్యోతినగర్‌, టెలిఫోన్‌ కాలనీ, సప్తగిరికాలనీ, శివనగర్‌, గణేశ్‌నగర్‌, భగత్‌నగర్‌, తిరుమల్‌నగర్‌, ఇందిరానగర్‌, ఆదర్శనగర్‌, ప్రవిష్ట ఏరియా నుంచి కిసాన్‌నగర్‌ వైపు ఉండేలా ప్రతిపాదించారు.

ఐదు జోన్లలో ప్రాంతాల వారీగా...

1. రేకుర్తి రోడ్డు, విద్యానగర్‌, పీఆండ్‌టీ కాలనీ, చైతన్యపురి, సంతోష్‌నగర్‌, భాగ్యనగర్‌, విద్యానగర్‌, జ్యోతినగర్‌, రాంనగర్‌, శివనగర్‌, సప్తగిరికాలనీ, శ్రీనగర్‌కాలనీ, మంకమ్మతోట, పద్మనగర్‌, ముకరంపుర, కశ్మీర్‌గడ్డ, భగత్‌నగర్‌, రాంచంద్రాపూర్‌కాలనీ, కట్టరాంపూర్‌, తిరుమల్‌నగర్‌, గణేశ్‌నగర్‌, బోయవాడ, మారుతీనగర్‌, షాషాబ్‌మహల్‌,  లక్ష్మీనగర్‌, పోచమ్మవాడ, కోతిరాంపూర్‌ నుంచి మానేరు నది వరకు.
2. బ్యాంకుకాలనీ, సూర్యనగర్‌, వావిలాలపల్లి, ఆదర్శనగర్‌, క్రిస్టియన్‌కాలనీ, సాయినగర్‌, అజ్మత్‌పుర, ఉస్మాన్‌పుర, ఇస్లాంపుర,  అశోక్‌నగర్‌, హౌసింగ్‌బోర్డుకాలనీ,  కృష్ణనగర్‌, హుస్సేనీపుర, శ్రీపురంకాలనీ, సుభాష్‌నగర్‌, విజ్ఞాన్‌నగర్‌కాలనీ నుంచి మానేరు నది వరకు.
3. సరస్వతీనగర్‌, కిసాన్‌నగర్‌, జగ్జీవన్‌రావుకాలనీ మీదుగా సిటీజన్‌కాలనీ నుంచి మానేరు నది వరకు.
4. పార్ట్‌ రాంచంద్రాపూర్‌కాలనీ, కట్టరాంపూర్‌,  పార్ట్‌ సప్తగిరికాలనీ, హనుమాన్‌నగర్‌,  అలకాపురికాలనీ, పార్ట్‌ పోచమ్మవాడ మీదుగా ఎన్టీఆర్‌ విగ్రహం వరకు.
5. ఆర్టీసీ కాలనీ, సాలెహ్‌నగర్‌, పార్ట్‌ బ్యాంకుకాలనీ, హిందూపురికాలనీ మీదుగా జగిత్యాల రోడ్డు కెనాల్‌ వరకు.'


తొమ్మిది నెలల్లో పూర్తికి కార్యాచరణ
- వై.సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌

స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశంలో సాంకేతిక అనుమతి లభించింది. వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. 6-9 నెలల వ్యవధిలో పనులు పూర్తి కావాలనే లక్ష్యాన్ని విధించడం జరిగింది. ముందుగా సమస్యలున్న చోట వర్షాకాలం లోగా పనులు పూర్తి చేయించడం జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని