logo

లీకైన వంటగ్యాస్‌ సిలిండర్‌... తప్పిన పెనుప్రమాదం

వంటగ్యాస్‌ సిలిండర్‌ లీకైన ఘటన సుల్తానాబాద్‌ మండలకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గృహిణి న్యాతరి రమ ఇంట్లో వంట చేస్తుండగా ఓకేసారి వంటగ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రమ తన భర్త శ్రీనివాస్‌ను పిలిచింది

Published : 18 Jan 2022 02:04 IST

సిలిండర్‌ లీకైన దృశ్యం

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: వంటగ్యాస్‌ సిలిండర్‌ లీకైన ఘటన సుల్తానాబాద్‌ మండలకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గృహిణి న్యాతరి రమ ఇంట్లో వంట చేస్తుండగా ఓకేసారి వంటగ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రమ తన భర్త శ్రీనివాస్‌ను పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ సిలిండర్‌ను పొయ్యినుంచి వేరుచేసి బయట పడేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గత మూడు రోజుల క్రితమే గ్యాస్‌ లీకవుతుందని ఫిర్యాదు చేసినా సంబంధిత ఏజెన్సీ వాళ్లు పట్టించుకోలేదని, ఏజెన్సీ నిర్వాహకుల అలసత్వంతోనే ఈప్రమాదం చోటుచేసుకుందని బాధితులు ఆరోపించారు. సంబంధిత అధికారులు విచారించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని