logo

మిషన్‌ భగీరథ.. లీకేజీలతో వ్యథ

ఇంటింటికీ శుద్ధజలం అందించాలన్న మిషన్‌ భగీరథ పథకానికి లీకేజీల బెడద ఎక్కువైంది. ఎప్పటికప్పుడు మరమ్మతు చేపట్టాల్సి ఉండగా సంబంధిత యంత్రాంగం అందుకు తగ్గట్టుగా స్పందించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో అన్ని కాలనీలకు సరిపడా తాగునీరందడంలేదు.

Published : 18 Jan 2022 02:04 IST

ఇంటింటికీ శుద్ధజలం అందించాలన్న మిషన్‌ భగీరథ పథకానికి లీకేజీల బెడద ఎక్కువైంది. ఎప్పటికప్పుడు మరమ్మతు చేపట్టాల్సి ఉండగా సంబంధిత యంత్రాంగం అందుకు తగ్గట్టుగా స్పందించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో అన్ని కాలనీలకు సరిపడా తాగునీరందడంలేదు. నందిమేడారంలోని హనుమాన్‌ ఆలయం వెనకవైపు వీధిలో లీకేజీ ఏర్పడి పక్షందాటినా ఇప్పటికీ మరమ్మతు చేపట్టలేదు. ప్రధాన పైపులైన్‌ అయితే గ్రిడ్‌ ఆధ్వర్యంలో, అంతర్గత పైపులైన్లయితే గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. రెండు లైన్లున్న చోట లీకేజీలు ఏర్పడ్డప్పుడు మీదంటే మీదే బాధ్యత అని ఇరువురూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి శుద్ధజలం వృథాకాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, ధర్మారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని