logo

రామగుండంలో కరోనా విజృంభణ

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్పత్రి విధుల్లోకి వచ్చిన ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో తిరిగి వెళ్లిపోయారు.

Published : 18 Jan 2022 02:04 IST

గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షల కోసం క్యూలైను
గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్పత్రి విధుల్లోకి వచ్చిన ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో తిరిగి వెళ్లిపోయారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలోని కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్క రోజునే 1140 మందికి కరోనా పరీక్షలు చేయగా 310 మందికి కరోనా పాజిటివ్‌ సోకినట్లుగా తేలింది. అత్యధికంగా గోదావరిఖని ఆర్టీపీీసీీఆర్‌ కేంద్రంలో 173 మందికి పరీక్షలు చేయగా 48 మందికి, ర్యాపిడ్‌ టెస్టులో 150 మందికి పరీక్షలు చేయగా 65 మందికి, అడ్డగుంటపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో 71 మందికి గాను 29 మందికి కరోనా పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారించారు. సింగరేణి ఆర్జీ-1, 2 ఆస్పత్రుల్లో 242 మందికి పరీక్షలు నిర్వహించగా 119 మందికి పాజిటివ్‌ వచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని