logo

రెండేళ్లకు రహదారి నిర్మాణానికి మోక్షం

రెండేళ్ల క్రితం సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో చేపట్టాల్సిన రహదారి నిర్మాణం పనులకు ఇప్పుడు మోక్షం లభించింది. రాజీవ్‌ రహదారి నుంచి గోదావరిఖనిలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి గోదావరినది వరకు రహదారి నిర్మాణం కోసం డి.ఎం.ఎఫ్‌.టి. నిధులు రూ.40 లక్షలు కేటాయించారు.

Published : 18 Jan 2022 02:34 IST

రెండేళ్ల క్రితం సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో చేపట్టాల్సిన రహదారి నిర్మాణం పనులకు ఇప్పుడు మోక్షం లభించింది. రాజీవ్‌ రహదారి నుంచి గోదావరిఖనిలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి గోదావరినది వరకు రహదారి నిర్మాణం కోసం డి.ఎం.ఎఫ్‌.టి. నిధులు రూ.40 లక్షలు కేటాయించారు. అప్పట్లో కంకర వేసి రహదారి నిర్మాణం పనులు మొదలుపెట్టినప్పటికీ వివిధ కారణాలతో ఆపేశారు. తాజాగా ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్న నేపథ్యంలో అదే నిధులు, అదే గుత్తేదార్లతో సిమెంటు రహదారి నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు మధ్యలో కొంత స్థల వివాదం ఉండడంతో దానిని వదిలేసి నిర్మాణం పనులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

- న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని