logo

భక్తురాలి ఆత్మహత్యాయత్నం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న ఆలయం ఓపెన్‌ స్లాబ్‌పై సోమవారం ఓ భక్తురాలు చీరతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన తోటి భక్తులు కేకలు వేయడంతో

Published : 18 Jan 2022 02:34 IST

వేములవాడ ఆలయం, న్యూస్‌టుడే : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న ఆలయం ఓపెన్‌ స్లాబ్‌పై సోమవారం ఓ భక్తురాలు చీరతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన తోటి భక్తులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది, పోలీసులు వెంటనే ఆమెను కాపాడి 108లో చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమె గోదావరిఖని హనుమాన్‌ నగర్‌కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.ఈమె మతి స్థిమితం కోల్పోయి గత కొంత కాలంగా ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని